శని అమావాస్యకు దత్తగిరి ముస్తాబు
– నేడు జ్యేష్ఠా దేవి కళ్యాణోత్సవం
– భక్తులకు భారీ ఏర్పాట్లు
ప్రజా సింగడి ప్రతినిధి మర్చి 28 జహీరాబాద్
జహీరాబాద్ నియోజకవర్గం లోని ఝరాసంగం మండలం బర్దిపూర్ గ్రామములో :ప్రశాంతతకు, ప్రకృతికి నిలయమైన బర్దిపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమం శని అమావాస్య వేడుకలకు సర్వం సిద్ధమైంది. జ్యేష్ఠా దేవి కళ్యాణం కోసం ఏర్పాటు చేశారు. శనివారం శని అమావాస్య సందర్భంగా దత్తగిరి ఆశ్రమంలోని శనేశ్వర స్వామి దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని, భక్తుల కోసం చలువ పందిళ్లు, త్రాగునీటి సౌకర్యం క్యూలైన్లు ఏర్పాట్లు చేసినట్లు ఆశ్రమ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ 1008 వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్ తెలిపారు. ఉదయం 5 గంటల నుండి శనేశ్వర స్వామి వారికి తైలాభిషేకం, శని మహా యజ్ఞం, జ్యేష్ఠా దేవి సమేత శనేశ్వర స్వామి కళ్యాణోత్సవం, మహా మంగళారతి, భక్తులకు అన్నదానం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. అమావాస్య తిథి పితృ దేవతలకు ముఖ్యమైనదని, శనివారం అమావాస్య రావడం వల్ల పితృ దేవతలను స్మరించుకోవడం వారికి తర్పణం సమర్పించడం శుభప్రదంగా భావిస్తారని ఆయన అన్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై శని అమావాస్య వేడుకలను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.




Post Comment