వ్యక్తి అదృష్యం కేసు నమోదు
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. ఏప్రిల్, 17.
కుటుంబ కలహాలతో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన వ్యక్తి అదృశ్యమైన ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గుండ్లపల్లి లో గురువారం చేటుచేసుకుంది శివ్వంపేట ఎస్ ఐ మధుకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గుండ్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. కుల్ల మల్లేష్ వయస్సు(40సం) కుటుంబంలో చిన్న ఘర్షణ తలెత్తడంతో మనోవేదనకు గురై బుధవారం రాత్రి ఇంట్లో నుంచి వెళ్లి తిరిగిరాలేదు. చుట్టుప్రక్కల, బంధువుల దగ్గర వెతికినా ఆచూకీ లభించకపోవడంతో భార్య లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేయడం తొ. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నం అని ఎస్ఐ మధుకర్ రెడ్డి తెలిపారు.




Post Comment