గురుకుల ప్రిన్సిపల్ విద్యార్థులను కొట్టిన ఘటన..-RSP సీరియస్..
గురుకుల ప్రిన్సిపల్ విద్యార్థులను కొట్టిన ఘటన..-RSP సీరియస్..
ప్రజా సింగిడి: వికారాబాద్ జిల్లాలో గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ విద్యార్థులను బూతులు తిడుతూ కొట్టిన ఘటనపై బీఆర్ఎస్ నేత RS ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. గురుకులాల్లో ఇట్లనేనా మా పిల్లలను మీరు పెంచేది? పిల్లలను వాళ్ల తల్లులను బూతు మాటలతో తిట్టొచ్చా..? మీ ఇళ్లలో పిల్లలను ఇట్లనే దండిస్తారా? పిల్లలు తప్పు చేస్తే కౌన్సిలింగ్ ఇవ్వాలి’ అని CM రేవంత్ రెడ్డి ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవాలని Xవేదికగా RS ప్రవీణ్ కోరారు.
◆విద్యార్థులను కొట్టి.. బూతులు తిట్టిన ప్రిన్సిపల్ (వీడియో)
చెప్పకుండా బైటకు వెళ్లారని ప్రిన్సిపల్ విద్యార్థినులను దారుణంగా కొట్టారు. వికారాబాద్లోని కొత్తగడి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల/కళాశాల విద్యార్థినులను ప్రిన్సిపల్ బూతులు తిడుతూ కొట్టారు. తాము వెళ్లడం తప్పేనంటూ విద్యార్థినులు చెప్పే ప్రయత్నం చేస్తుండగా.. ఓ విద్యార్థినిని పలుమార్లు చెంప దెబ్బలు కొట్టారు. ఈ ఘటన జరగడం పై చర్చనీయాంశంగా మరింది.




Post Comment