విద్య తోనే సమాజంలో మార్పు
*కాసాల కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు వెంకటేష్ పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ కి పెన్స్ ప్యాడ్స్ సామాగ్రి వితరణ
ప్రజా సింగిడి ప్రతినిధి హత్నూర. మార్చు, 20.
విద్యతోనే వివిధ రకాల మార్పు సమాజంలో చెందుతుందని తద్వారా విద్య ద్వారానే విద్యార్థులు ఉన్నత శిఖరాలను ఆధిరోహించాలని కోటముల వెంకటేష్ పేర్కొన్నారు. కాసాల గ్రామంలోజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం పాఠశాలలో విద్యార్థి విద్యార్థినులకు పెన్నులు ప్యాడ్లు పంపిణీ అదేవిధంగా ఎగ్జామ్స్ కి వెళ్లే ఆటో నియమిత ఖర్చులు కూడా చేస్తానని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు వెంకటేష్ మాట్లాడుతూ… విద్యార్థులు స్టెస్కకి గురికాకుండా పదవ తరగతి విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో ఆలోచింపజేసే సరళీలో పరీక్షలు రాయాలని విద్యార్థినులకు సూచించారు. ఇదేవిధంగా వెంకటేష్ స్థానిక కాసాల గ్రామలో ఉన్నత పాఠశాలలో మౌలిక వసతులు కల్పనకు తమ వంతు కృషి చేస్తానని దీంతోపాటు కాసాల గ్రామానికి పేరు తెచ్చే విధంగా 10/10 జీపీఏలు సాధించాలని వారు ఆకాంక్షించారు. విద్యార్థినిలు పరీక్షలు మార్కులు తక్కువ వచ్చాయని అధైర్య పడకుండా రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత చదువులు చదువి ముందుకు వెళ్లాలని అప్పుడే అనుకున్నది సాధ్యమవుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థినిలు వెంకటేష్ గాలయ్య గణేష్ గౌడ్ అఖిల్ గౌడ్ రాజు తదితరులు పాల్గొన్నారు.




Post Comment