విజన్ స్టూడియోస్ నుండి ప్రతిభకు గౌరవం
– Icons of Excellence Awards – 2025
ప్రజా సింగిడి ప్రతినిధి హైదరాబాద్. మే ,09 .
పోస్ట్ ప్రొడక్షన్ రంగంలో 100కి పైగా సినిమాలకు సేవలందించిన ప్రముఖ సంస్థ విజన్ స్టూడియోస్, తమ 11వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్రకటించింది – Icons of Excellence – 2025 అవార్డులు, ఈ కార్యక్రమం జూన్ 21న హైదరాబాద్‌లో జరగనుంది. సినీ రంగం తో పాటు వివిధ రంగాల్లో విశేష సేవలందించిన 24 విభాగాల్లో ప్రతిభావంతులను రాజకీయ, సినీ ప్రముఖుల సమక్షంలో సత్కరించబోతున్నారు.విజన్ స్టూడియోస్ అధినేత అన్నవేన రమేష్ వ్యాఖ్యానిస్తూ,
ప్రతి రంగంలోనూ ఉన్న టాలెంట్‌ను సినీ అవార్డుల స్థాయిలో గౌరవించాలన్నదే మా లక్ష్యం. సామాజిక సేవ,కళ, ఆరోగ్య, విద్య, యువశక్తి, రియల్ ఎస్టేట్, స్పోర్ట్స్ వంటి 24 విభాగాల్లో అవార్డులు ఇస్తున్నాము.ఇది ఒక గౌరవం, గుర్తింపు, గర్వించదగిన ప్రస్తానం.ఈ అవార్డు పోస్టర్ ను డైరెక్టర్ రోశి రెడ్డి , విష్ణు , ప్రసాద్ , హీరోయిన్ ప్రవళిక, హాసిని, నిషా,స్టూడియో ఇంచార్జ్ అర్పిత ,గణేష్ , ఎడిటర్ సాయి కుమార్ పలువురు ఆర్టిస్ట్లు, బిజినెస్ మ్యాన్ ప్రసాద్ , రాజేంద్ర చేతుల మీదుగా సంయుక్తంగా ఆవిష్కరించారు.ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఆసక్తి గల వారు తమ వివరాలను WhatsApp – 9885553245 నంబరుకు పంపవచ్చు.ఇది ఒక గుర్తుండిపోయే సమ్మేళనం కానుంది.తేదీ: జూన్ 21, 2025
స్థలం: హైదరాబాద్




Post Comment