వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ ప్రారంభం
జహీరాబాద్ ప్రజా సింగిడి న్యూస్ మే 29 సంగారెడ్డి జిల్లా
జహీరాబాద్ నియోజకవర్గం లోని మొగుడంపల్లి మండలంలోని గొడగార్పల్లి, గుడుపల్లి, గౌసాబాద్ తాండా గ్రామాలలో వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని సంగారెడ్డి జిల్లా నోడల్ అధికారి డా. సి. వర ప్రసాద్ ప్రారంభించారు. ఆయన రైతులతో అభియాన్ ముఖ్య ఉద్దేశ్యం గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ సాంకేతికత విస్తరణ, రైతుల అవగాహన పెంపు, ప్రభుత్వ పథకాల చేరవేయడం అని పేర్కొన్నారు.
సందర్భంగా మరో నోడల్ అధికారి, సహాయ వ్యవసాయ అధికారి, బిక్షపతి గ్రామాలను సందర్శించి, ఖరీఫ్ పంటలు మరియు వాటికి సంబంధించిన ప్రభుత్వ పథకాలపై రైతులకు అవగాహన కల్పించారు.పరిశోధనా స్టేషన్ (FRS), సంగారెడ్డి అధిపతి డా. సుచిత్రా హార్టికల్చర్ పంటల ప్రాముఖ్యతను వివరించారు. తోటల శాఖ అధికారి పండరి తోటల పథకాలపై రైతులకు వివరాలు అందించి, రైతులందరూ తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.
జాతీయ చిరుధాన్యాల పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డా. డి. సేవనాయక్ మాట్లాడుతూ చిరుధాన్యాల సాగు గురించి, ఉపయోగల గురించి, చిరుధాన్యాలలో ఉండే పోషకాల గురించి కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ పథకాల గురించి వివరించి, రాబోయే కాలంలో చిరుధాన్యాల అవసరం చాలా ఉంటుంది కాబట్టి రైతులు చిరుధాన్యాల సాగు చేయాలని కోరారు.
మట్టి పరీక్ష కార్డులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా రైతులకు అవసరమైన వ్యవసాయ సమాచార సాహిత్యం కూడా అందించబడింది. సందర్భంగా డి డి యస్ కృషి విజ్ఞాన కేంద్రం (KVK) శాస్త్రవేత్తలు మాట్లాడుతూ:
రమేష్ ఖరీఫ్ పంటల నిర్వహణ, ముఖ్యంగా కందులు చెరకు పంటలపై
డా. స్నేహలత ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్‌మెంట్ (IPM) పై అవగాహన కల్పించారు.
. కైలాష్ వర్షాకాలంలో పశువుల ఆరోగ్య నిర్వహణ పై వివరించారు.
శైలజ వర్షాకాల కూరగాయల సాగు పై మాట్లాడాతు .స్వామి గ మట్టి పరీక్షల ప్రాముఖ్యత పై వివరించారు.మన భూములలో సేంద్రియ కార్బణం తక్కువ ఉన్నందున సేంద్రియ ఎరువులు ఎక్కువ వేసుకోవాలని అని అంతే కాకుండా కాంప్లెక్స్ ఎరువులు కేవలం పంట వేసిన 30- 40రోజులలోనే వాడాలని మిగతా ఎరువులు సూటి ఎరువాల రూపంలో వేయాలని సూచించారు.అన్ని అంశాల్లో రసాయనిక ఎరువులు పురుగుమందుల వినియోగాన్ని తగ్గించుకోవాలని శాస్త్రవేత్తలు సూచించారు.
కోరోమాండల్ గ్రోమోర్ సంస్థ ప్రతినిధులు డ్రోన్ సాంకేతికతపై రైతులకు ప్రదర్శన ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో KVK శాస్త్రవేత్తలు సిబ్బంది, వ్యవసాయ అధికారి – హసేనుద్దీన్, AEOలు – ప్రవీణ్ సరస్వతి తదితరులు పాల్గొన్నారు.




Post Comment