వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్…
వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ ,
రైతుల కోసం అవగాహనా కార్యక్రమం,,
ప్రజా సింగిడి,మే 30 జహీరాబాద్ (సంగారెడ్డి జిల్లా)
జహీరాబాద్ నియోజకవర్గం లోని న్యాల్కల్మం డలంలోని మామిడిగి (రైతు వేదిక), మేటల్‌కుంట, గంగవార్ గ్రామాల్లో వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ పేరుతో రైతులకు అవగాహన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి మండల వ్యవసాయ అధికారి అబినాష్ వర్మ హాజరై, రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ప్రతి రైతు తమ వివరాలను నమోదు చేసి యూనిక్ ఫార్మర్ ID (యూనిక్ రిజిస్ట్రేషన్ నంబర్) పొందాలని, తద్వారా రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే అనేక పథకాల ప్రయోజనాలు నేరుగా చేరుతాయని తెలిపారు.
డా. సి. వర ప్రసాద్, సంగారెడ్డి జిల్లా నోడల్ అధికారి మాట్లాడుతూ, వికసిత్ భారత్ @ 2047 దిశగా సాగుతున్న ఈ కార్యక్రమం గ్రామీణ వ్యవసాయాన్ని స్థిరంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. రైతులకు మద్దతుగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అనేక పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. డా. సాయి ప్రియాంక, వ్యవసాయ విస్తరణ శాస్త్రవేత్త మాట్లాడుతూ రైతుల కోసం ఉన్న భీమా, సబ్సిడీ, సాగు పథకాలు, తోటల పథకాలు, ఇన్సూరెన్స్, PM-KISAN, PMFBY వంటి వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల గురించి సవివరంగా వివరించారు. డా. కైలాష్, పశువైద్య శాస్త్రవేత్త వర్షాకాలంలో పశువుల వ్యాధుల నిర్వహణ, టీకాలు, పోషకాహారం, నివారణ పద్ధతులు మొదలైన అంశాలపై మాట్లాడారు. డా. స్నేహలత, శాస్త్రవేత్త ఖరీఫ్ పంటలలో సమగ్ర తెగుళ్ల నివారణ పద్ధతులు (IPM), ప్రత్యేకించి కందులు మొదలైన పంటలపై వివరించారు. రమేష్, శాస్త్రవేత్త ఖరీఫ్ పంటలలో ఎరువుల సమతుల్యత (INM), సాగు విధానాలు విత్తన శుద్ధి, నీటి నిర్వహణ అంశాలపై చక్కటి అవగాహన కల్పించారు. శైలజ, శాస్త్రవేత్త తోటల ఏర్పాట్లు, తోటల భద్రత, సాగు చేసే పంటలు మొదలైన వాటిపై వివరణ ఇచ్చారు. హేమలత, సంతులితాహారం, సేంద్రియ ఆహారం వంటి అంశాలపై వివరించారు.ఈ.
స్వామి మాట్లాడుతూ ప్రతి ఒక రైతు భూసారా పరీక్షలు చేసుకోవాలని దానికి అనుగుణంగా ఎరువులు వాడాలని సూచించారు.ఈ సందర్భంగా ఉచితంగా మట్టి పరీక్ష కార్డులు పంపిణీ చేయడమేకాకుండా, రైతులకు ఉపయోగపడే సాహిత్యం, లిఫ్‌లెట్లు కూడా అందించబడ్డాయి. ఈ కార్యక్రమంలో KVK సిబ్బంది . రైతులు పెద్ద సంఖ్యలో ప్రశ్నలు అడిగి, శాస్త్రవేత్తల నుంచి నేరుగా సమాధానాలు పొందారు. ఈ కార్యక్రమం ద్వారా రైతులకు శాస్త్రీయ అవగాహన పెరిగి, పంటల విస్తరణ, ఎరువులు, తెగుళ్లు, పశుసంరక్షణ, పోషణ అంశాల్లో మెరుగైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కలగనున్నాయి. రైతులు, తదితరులు పాలొగొన్నారు.




Post Comment