వన దుర్గామాతను దర్శించుకున్న మెదక్ జిల్లా కలెక్టర్..
వన దుర్గామాతను దర్శించుకున్న మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
ప్రజాసింగిడి మెదక్ జిల్లా
ఉమ్మడి ప్రతినిధి మార్చ్ 30
మెదక్ జిల్లా పాపన్నపేట గ్రామంలో వెలిసిన వేడిపాయల వన దుర్గ భవాని కలెక్టర్ రాహుల్ రాజ్ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, దంపతులు ఏడుపాయల వనదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు
ఏడుపాయల వనదుర్గా మాత అమ్మవారిని దర్శించుకోవడానికి
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులకు ఆలయ అర్చకులు, వేదమంత్రాలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు
అనంతరం అమ్మవారి దర్శనం కల్పించి
తీర్థప్రసాదాలు అందించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ. జిల్లాలో ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.మన పండుగలు, ఆచారాలు సంప్రదాయాల వెనుక ఎంతో శాస్త్రీయత దాగి ఉంటుందని ఉగాది పండుగ ఇది వసంతకాలం రాకను కూడా ప్రభావితం చేస్తుందని ఆరోగ్యపరంగా చూస్తే వసంత ఋతువు ప్రారంభంలో వచ్చే కొన్ని రకాల వ్యాధులకు విరుగుడు ఈ వేపపువ్వు వేసి చేసిన ఉగాది పచ్చడి.
వసంత ఋతువు ప్రారంభంలో వచ్చే ఈ ఉగాది పండుగను ప్రధానంగా ప్రకృతి పండుగగా తెలుగు ప్రజలు భావిస్తారని తెలిపారు.
అదనపు కలెక్టర్ నగేష్ కుటుంబ సమేతంగా ఏడుపాయల వనదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు.
అమ్మవారి దర్శనానంతరం తీర్థ ప్రసాదాల స్వీకరించి ఆలయ విశిష్టత గురించి నిర్వాహకులు అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహకులు , అర్చకులు తదితరులు పాల్గొన్నారు.




Post Comment