లయన్స్ క్లబ్ ఆఫ్ క్యాంటన్ పార్క్ హైదరాబాద్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన లోయపల్లి నర్సింగ్ రావు
లయన్స్ క్లబ్ ఆఫ్ క్యాంటన్ పార్క్ హైదరాబాద్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన లోయపల్లి నర్సింగ్ రావు
ప్రజా సింగిడి,హైదరబాద్
● స్థానిక లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. స్థానిక క్లబ్ కార్యాలయంలో ఆ సంస్థ గవర్నర్, దీపక్ భట్టాచార్జి ఆధ్వర్యంలో నూతన సభ్యులతో ప్రమాణం చేయించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ క్యాంటన్ పార్క్ హైదరాబాద్ అధ్యక్షుడిగా మాచారెడ్డి మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగ్ రావును ఎన్నుకున్నారు. ఇట్టి కార్యక్రమానికి చీప్ గెస్ట్ గా టి. రాజేంద్రప్రసాద్, కోఆర్డినేటర్ ఎస్. ఎన్. రెడ్డి భీమిడి మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ క్యాంటన్ పార్క్ హైదరాబాద్ సభ్యులు, తదితరులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.




Post Comment