లంబాడి సామాజిక వర్గానికి మంత్రి పదవి కేటాయించాలి : మోహన్ పవర్
లంబాడి సామాజిక వర్గానికి మంత్రి పదవి కేటాయించాలి : మోహన్ పవర్
ప్రజా సింగిడి ప్రతినిధి నల్గొండ : అక్టోబర్, 30.
తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ విస్తరణలో లంబాడి (బంజారా) సామాజిక వర్గానికి మంత్రి పదవి కేటాయించాలని నల్గొండ జిల్లా గిరిజన సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు మోహన్ పవర్ డిమాండ్ చేశారు.
మోహన్ పవర్ మాట్లాడుతూ, “ఆనాడు ఇందిరా గాంధీ కాలం నుండి ఈనాటి వరకు బంజారా సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీతోనే ఉంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని దాదాపు 42 నియోజకవర్గాలలో లంబాడీలు ఏకతాటిపై నిలిచి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. అయినప్పటికీ ఇప్పటివరకు బంజారా వర్గానికి ఒక్క మంత్రి పదవీ కేటాయించలేదు” అని తెలిపారు.
అదే విధంగా, “రాబోయే క్యాబినెట్ విస్తరణలో బంజారా సామాజిక వర్గానికి న్యాయం చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహన కార్యక్రమాలు నిర్వహిస్తామని” మోహన్ పవర్ హెచ్చరించారు.




Post Comment