రోడ్లు భవనాల శాఖ అధికారులపై MLA ఆగ్రహం వ్యక్తం…
రోడ్లు భవనాల శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం…
ఎమ్మెల్యే కొనిoటీ మాణిక్ రావు ,
ప్రజా సింగిడి , మే 30 సంగారెడ్డి జిల్లా
జహీరాబాద్ నియోజకవర్గం లోని పట్టణంలో మునిసిపల్, పరిధిలో ఉన్న గుంతలమైన అల్గొల్ బైపాస్ రోడ్డును పరిశీలించిన ఎమ్మెల్యే మాణిక్ రావు.జహీరాబాద్ , నుండి భరత్ నగర్ , అల్గోల్ వైపు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయమై ప్రమాదాలు జరుగుతున్న విషయాన్ని గుర్తించిన కోనింటి మాణిక్ రావు శుక్రవారం స్థానిక నాయకులు ఆర్ అండ్ బి అధికారులతో కలిసి రోడ్డును పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆర్ &అండ్ బి ఈఈ , SE తో ఫోన్లో సంభాషిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు . గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఈ రోడ్డు సమస్య పరిష్కారానికి 80 లక్షల రూపాయలు మంజూరు చేశామని , కాంట్రాక్టర్ కేవలం బ్రిడ్జ్ మాత్రమే నిర్మించి అప్ప్రోచ్ రోడ్డు నిర్మించకుండా వదిలేసాడని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని తొందరగా అప్రోచ్ రోడ్డు నిర్మించాలని లేనియెడల ధర్నాకు దిగుతామని హెచ్చరించారు, ఈ రోడ్డు ద్వారా వెళ్లే వాహనదారులు క్షేమంగా వెళ్లే విధంగా తక్షణమే తాత్కాలిక మరమ్మత్తులు చేయాలని ఎమ్మెల్యే స్థానిక అధికారులకు ఆదేశించారు , కార్యక్రమంలో మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప ,సీనియర్ నాయకులు నామ రవికిరణ్, మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్, మొహియుద్దీన్, యువ నాయకులు మిథున్ రాజ్ ,ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు శివప్పా,నాయకులు పురుషోత్తం రెడ్డి,దీపక్ ,నరేష్ రెడ్డి,సందీప్,ఫయాజ్,
అశోక్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి, అనిల్ ,బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య తదితరులు, పాలొగొన్నారు.




Post Comment