రైతు ముంగిట శాస్త్రవేత్తల కార్యక్రమం…
పాల్గొన్న వ్యవసాయ శాస్త్రవేత్తలు…
ప్రజా సింగిడి మెదక్ జిల్లా స్టాపర్,తూప్రాన్, మే 31
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయంలోని రైతు ముంగిట శాస్త్రవేతలు ప్రోగ్రామ్ లో భాగంగా డా. యం. రాజశేఖర్ కీటక శాస్త్రవేత గంగామల్లు మండల వ్యవసాయ అధికారి పాల్గొని రైతులకు రాబోయే వానాకాలం పంటలలో యాజమాన్యం గురించి తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి రైతు వేదికలో రైతులకు వివరించారు. ఇందులో వరిలో సన్న గింజ రకాలు, వాటి లక్షణాలు, పాటించాల్సిన పద్ధతులను వివరించారు, అంతేకాకుండా సంప్రదాయ పంటలతో పాటు ఇతర వాణిజ్య పంటలు ఆయిల్ పామ్ సాగు చేసి రైతులు ఆర్థికంగా వృద్ధి చెందాలన్నారు, ముఖ్యంగా తక్కువ యూరియా వాడకం, రసాయన పురుగు మందుల వాడడంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, సమర్థ నీటి వినియోగం, అటవి వ్యవసాయం, విత్తనము, నేల శుద్ధి, పంట మార్పిడి, రైతులు ఏవి కొనుగోలు చేసిన రశీదులు జాగ్రత్తగా పర్చుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో పి. గంగామల్లు వ్యవసాయ అధికారి టి. సింధు, సంతోష్, వ్యవసాయ విస్తరణ అధికారి ఇతర గ్రామ ప్రతినిధులు, రైతులు, యువకులు పాల్గొన్నారు. అనంతరం రైతులతో శాస్త్రవేతలు చెప్పిన యాజమాన్య పద్ధతులు తప్పక పాటించాలని ప్రతిజ్ఞ తీసుకున్నారు.




Post Comment