రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ లో నూతన పాలసీ అమలు కు శ్రీకారం
రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
ప్రజా సింగిడి మెదక్ జిల్లా స్టాపర్,తూప్రాన్, ఏప్రిల్, 4.
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యo లో నూతన పాలసీని తీసుకవచ్చి రహదారులపై ప్రతి 35-40 కిలో మీటర్ల దూరం లోపు ట్రామ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. శుక్రవారం తూప్రాన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో డయాలసిస్ సెంటర్ ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ రాష్ట్రం లో 7,500 ట్రామా కేంద్రాల ఏర్పాటు చేసి అత్యవసర వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాల్లో అంబులెన్స్ కూడా ఏర్పాటు చేస్తామనితెలిపారు. రాబోయే కాలం లో ప్రతి వ్యక్తి విద్య వంతుడు, సంస్కార వంతుడు కావాలి అని అన్నారు. బాలికలు నైపుణ్య అభివృద్ధి చెంది, మహిళా సాధికారత సాధించాలి అని ఆకాంక్షించారు. ప్రమాదాలకు కారణం వ్యసనాలు అని, సమాజాన్ని, పిల్లల్ని వ్యసనాల నుంచి కాపాడుకోవాలి అని సూచించారు. రహదారులపై ప్రతి 35-40 కిలో మీటర్ల దూరం లోపు ట్రామ కేంద్రాన్ని నెలకొల్పబోతున్నమనీ తెలిపారు. రాష్ట్రం లో 7,500 ట్రామా కేంద్రాల ఏర్పాటు చేసి మెరుగైన వైద్య సేవలు అందిస్తామన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాల్లో అంబులెన్స్ కూడా ఏర్పాటు చేస్తామనితెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది మార్పును కోరుకుంటూ తెలంగాణ సమాజానికి జవాబుదారీతనంతో
సంక్షేమ పథకాల అందించడం లక్ష్యంగా ముందుకు పోవాలి అని అన్నారు. మహిళా సాధికారతే ధ్యేయంగా బాలిక విద్యను ప్రోత్సహిస్తూ తెలంగాణలో ప్రతి ఆడబిడ్డ ఉన్నత చదువులు చదువుకుని స్వతహాగా
బ్రతికే విధంగా తీర్చిదిద్దాలన్నారు. మన ప్రాంతం మన గ్రామం అభివృద్ధి పదంలో నడవాలంటే అందరి సమన్వయంతో సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడం చాలా అవసరం అని మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్,
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఆర్డీవో జయచంద్రారెడ్డి, డి.ఎం.అండ్ హెచ్.ఓ డాక్టర్ శ్రీరాం, జిల్లా సూపరింటెండెంట్ డాక్టర్ శివదయాల్, డిప్యూటీ డి.ఎం.అండ్ హెచ్ ఓ డాక్టర్ జ్ఞానేశ్వర్, తూప్రాన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ డాక్టర్ అమర్ సింగ్, సిద్దిపేట జిల్లా డిసిసి అధ్యక్షుడు,గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి, మెదక్ జిల్లా డిసిసి అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, తెలంగాణ ఫుడ్స్ మాజీ ఛైర్మన్ గంగుమళ్ల ఎలక్షన్ రెడ్డి, గజ్వేల్ యువ నాయకురాలు అక్షిత రెడ్డి, రాష్ట్ర సర్పంచ్ ల ఫోరం తాజా మాజీ అధ్యక్షుడు చిట్కుల మహిపాల్ రెడ్డి, రాష్ట్ర ఫిషరీస్ డైరెక్టర్ గడప దేవేందర్, మాజీ ఎంపిపి వెంకటేష్ యాదవ్, తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ మామిండ్ల జ్యోతి కృష్ణ, వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, పల్లెర్ల రవీందర్ గుప్త, కోడిప్యాక నారాయణ గుప్త, రామునిగారి శ్రీశైలంగౌడ్, జిన్నా భగవాన్ రెడ్డి, కుమ్మరి రఘుపతి, కుమ్మరి రమేష్, నేత మహేందర్ రెడ్డి, గజ్వేల్ నియోజక వర్గ సేవాదళ్ అధ్యక్షులు తాడూరి కృష్ణారెడ్డి, తూప్రాన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉమ్మన్న గారి భాస్కర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపిపి శరణ్య రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పల్లెర్ల రవీందర్ గుప్త, విశ్వరాజ్, పడాలపల్లి సిద్ధిరాములుగౌడ్, ర్యాకల కృష్ణగౌడ్, కూచారం లక్ష్మీ నర్సింలుగౌడ్, నాగులపల్లి వెంకట్ రెడ్డి, నాగులపల్లి సర్పంచ్ భగవాన్ రెడ్డి, ఇమామ్ పూర్ ఉప సర్పంచ్ బక్క సత్యనారాయణ గౌడ్, గరిగే నర్సింగ్ రావు, డాక్టర్ అప్సర్ భాయ్, కొక్కొండ శశి భూషణ్ రెడ్డి, అర్.నాగరాజు గౌడ్, నాగులపల్లి సత్యనారాయణ ముదిరాజు, ఇస్లాంపూర్ ఆకుల శ్రీరాములు, బియాని వంశీధరరెడ్డి, నర్సంపల్లి జింక మల్లేశం, కొత్తపల్లి నర్సింగరావు, గుర్రం రాము, హజార్, సమీర్, ఆసును, షరీఫ్, ఉమర్ తదితరులు పాల్గొన్నారు.




Post Comment