రాజకీయ రారాజు మాన్య కాన్సీరాం ఘనంగా జయంతి వేడుకలు…
రాజకీయ రారాజు మాన్య కాన్సీరాం ఘనంగా జయంతి వేడుకలు…
ప్రజా సింగిడి ప్రతినిధి మర్చ్ 15 జహీరాబాద్
జహీరాబాద్,సంగారెడ్డి జిల్లా బిఎస్పీ కార్యాలయంలో లో మన్యా కాన్సిరాం జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది, భారత దేశ రాజకీయల్లో కాన్షీరాం ఒక సంచలనం ,ఘనంగా మాన్యవర్ కాన్షీరాం 91వ జయంతి వేడుకలు జరిపిన బీఎస్పీ నాయకులు.బహుజనులకు రాజ్యాధికార రుచి చూపించిన నాయకుడు. బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాన్షీరాం 91 వ జయంతి ని ఘనంగా జరిపిన పార్టీ నాయకులు. జిల్లా అధ్యక్షులు శశికాంత్ గిర్కల మాట్లాడుతూ, అనేక సంవత్సరాలుగా మానవ హక్కులకు దూరంగా ఉంచబడిన పీడిత వర్గాలను విముక్తి చేయడానికి డా.బి ఆర్ అంబేద్కర్ తన జీవితంలో చివరి శ్వాస వరకు కృషి చేస్తే ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకొని మరణించేవరకు పోరాడిన గొప్ప యోధుడు కాన్షీరాం,మాన్యశ్రీ కాన్షీరామ్… భారత రాజకీయాలలో ఆయన ఒక సంచలనం. అప్పటి వరకు నడుస్తున్న కులాధిపత్య రాజకీయాలను ఒక కుదుపు కుదిపిన అసమాన నాయకుడు. డాక్టర్ భారతరత్న .బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమ, రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని బహుజన రాజ్యాధికారమే జీవిత లక్ష్యంగా జీవించి, పీడిత జన సమూహాలను రాజ్యాధికారం వైపు నడిపిన విజయకేతనం కాన్షీరామ్ అన్ని రాకాల రాజకీయాలు, భావజాలాలు, ఆకాంక్షలు సంక్షోభం ఎదుర్కొంటున్న దశలో కాన్షీరామ్ బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించారు. ఇది SC, ST,వెనుకబడిన మైనార్టీ (BC)కులాల ఆకాంక్ష రాజకీయశక్తి. ఇది ఒక ఆధునిక సామాజిక రాజకీయ ఉద్యమం, పరస్పరం విడిపోయి కలహించుకుంటున్న 85 శాతం మందిని ఐక్యం చేసేందుకు ఆవిర్భవించిన ఉద్యమమది. ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకొని అణగదొక్కబడిన దోపిడికి గురౌతున్న బహుజనులను ఏకంచేసి, అమానవత్వం, అన్యాయం, అబద్రతలకు వ్యతిరేకంగా చేసే యుద్ధాన్ని… కాన్షీరామ్ స్థాపించిన బహుజన్ సమాజ్ పార్టీ (బి.ఎస్.పి) కొనసాగిస్తూనే ఉంటుంది. ఆయన త్యాగం భావితరాలకు స్ఫూర్తి అన్నారు.ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ గొల్ల , జిల్లా ఇంచార్జ్ లు మోహన్, ప్రేమ్ కుమార్ ,ప్రధాన కార్యదర్శి శ్రీధర్ , పటాన్చెరు అసెంబ్లీ అధ్యక్షులు శ్రీశైలం పడమటి , జిల్లా నాయకులు జనార్దన్, సంజీవ, పండరి , డేవిడ్, దేవదాస్ , ప్రశాంత్ , శ్రీనివాస్ , మహేష్ప,స్కే కృష్ణ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.




Post Comment