అంగ రంగ వైభవంగా రాములోరి కళ్యాణం
*శ్రీరామ నవమి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా*
*కాసాల గ్రామం అంతా రామమయం*
హత్నూర మండలం ఏప్రిల్ 6 ప్రజా సింగిడి ప్రతినిధి
హత్నూర మండలం కాసాల గ్రామంలో హనుమాన్ మందిర్ వద్ద శ్రీరామ నవమి పురస్కరించుకొని శ్రీ స్వామివారి అమ్మవార్ల కళ్యాణం మహోత్సవం భక్తిశ్రద్ధతో ఘనంగా నిర్వహించారు హనుమాన్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ… సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలను ప్రత్యేక పూలతో సీతారాములకు పట్టు వస్త్రాలు సమర్పించి వేద పండితులతో సీతారాముల కల్యాణాన్ని వేదమంతాలతో ఘనంగా నిర్వహించారు. ఆదివారం జరుగుతున్న శ్రీ సీతారామ చంద్ర స్వామి కళ్యాణానికి గ్రామస్తులు కుటుంబ సభ్యులతో వచ్చి అందరూ కనులారా తిలకరించారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ రాముడి అనుగ్రహంతో ప్రజలంతా కష్టాలు తొలగి ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో జీవించాలని ఆకాంక్షించారు.గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు అన్నదాన కార్యక్రమం స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మాజీ ఎంపీటీసీ విజయలక్ష్మి వెంకటేశం గుప్తా సొసైటీ డైరెక్టర్ నరసింహారెడ్డి ఏ,వి,ఆర్ ,ఫౌండేషన్ శరత్ టీచర్ ఆమదయ్య మల్లారెడ్డి చంద్ర, ప్రభు కృష్ణ, పి.నాగేష్, సుధీర్, శ్రీశైలం రమేష్ తదితరులు గ్రామ పెద్దలు యువకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




Post Comment