రంగంపేటలో నూతన ఫంక్షన్ హాల్
ప్రజా సింగిడి ప్రతినిధి కొల్చారం. మర్చి, 17.
మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ రంగనాయక అంబిక మినీ ఫంక్షన్ హాల్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించిన మన ప్రియతమ నాయకులు నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ శ్రీ ఆవుల రాజిరెడ్డి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్ కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగుల గారి మల్లేష్ గౌడ్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోమవారం ప్రారంభించిన ఈ ఫంక్షన్ హాల్ ఇక్కడ పరిసర ప్రాంతాలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని ఈ ఫంక్షన్ హాల్ వల్ల నిరుపేదలకు కూడా యజమాన్యం చేయూతనివ్వాలని వ్యాపారం సమృద్ధిగా సాగి మరో మెట్టు ఎదిగేందుకు ఈ ఫంక్షన్ హాల్ వారికి తొలిమెట్టు కావాలని ఫంక్షన్ హాల్ యజమానులైన తాజా మాజీ సర్పంచ్ బండి సుజాత రమేష్ మాజీ విద్యా కమిటీ చైర్మన్ కొమ్ముల రవీందర్ గౌడ్ గార్లకు ఈ సందర్భంగా తెలపడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చి ఫంక్షన్ హాల్ రిబ్బన్ కట్ చేసిన అతిధులకు యజమానులైన రమేష్ మరియు రవీందర్ గౌడ్ ఘనంగా శాలువాతో సన్మానం చేయడం జరిగిందిఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఉత్తం గారి గోవర్ధన్ జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి మారెళ్ళ అనిల్ రంగంపేట గ్రామ శాఖ అధ్యక్షులు కొండ కృష్ణ సంగయ్యపేట మాజీ సర్పంచ్ శ్రీశైలం నాయకులు పిఎసిఎస్ డైరెక్టర్ దుర్గేష్ గౌడ్. రమేష్ బీసీ సెల్ నాయకులు వెంకట్ గౌడ్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వురడి విజయకుమార్ గాండ్ల కృష్ణ గోవర్ధన్ రెడ్డి జంగిటి నాగరాజు నెల్లిరాజు బోయిని లలిత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు




Post Comment