మునిసిపల్ కమిషనర్లకు మున్సిపల్ బిల్ కలెక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన కలెక్టర్
మునిసిపల్ కమిషనర్లకు మున్సిపల్ బిల్ కలెక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన కలెక్టర్
ప్రజా సింగిడి ప్రతినిధి మర్చ్ 16 జహీరాబాద్
సంగారెడ్డి జిల్లాలో పన్నువసూలు పట్ల నిర్ల క్ష్యం వహించిన మున్సిపల్ అధికారులు, సిబ్బందిపై కలెక్టర్ క్రాంతి వల్లూరు చర్యలు తీసుకున్నారు. సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్లు, మే నేజర్లు, బిల్ కలెక్టర్లకు శనివారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ నెలాఖరులో గా 100శాతం ఇంటి పన్నులు, కుళాయి బిల్లులు వసూలు చేయాలని టార్గెట్ విధించగా మూడు మున్సిపాలిటీలలో బిల్లుల వసూలు పట్ల సిబ్బంది నిర్లక్ష్యం వహించడం పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల క్రితం కొంతమంది మున్సిపల్ బిల్ కలెక్టర్లు, రెవెన్యూ ఇన్ స్పెక్టర్లు, మేనేజర్లకు సస్పెన్షన్, షోకాజ్
నోటీసులు జారీ చేసినప్పటికీ సిబ్బంది పనితీరులో మార్పు రాకపోవడంతో జహీ రాబాద్ మున్సిపాలిటీ కమిషనర్ ఉమామ హేశ్వరరావు, మేనేజర్ ఉమేశ్వర్ లాల్, 8 మంది బిల్ కలెక్టర్లకు షోకాస్ నోటీసులు జారీ చేశారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్ ఎస్సీ వీకే ఛావన్, మేనేజర్ సూర్య ప్రకాశ్, 27 మంది బిల్ కలెక్టర్లకు షోకాజ్ నోటీసులు అందాయి. సదాశివపేట మున్సిపాలిటీలో కమిషన ర్ జే ఉమా, మేనేజర్ ఉమర్ సింగ్, 14 మంది బిల్ కలెక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. షోకాజ్ నోటీసులకు 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని లేకుంటే కఠిన శాఖాపరమైన చర్యలు తీసుకోనున్న ట్లు కలెక్టర్ పేర్కొన్నారు




Post Comment