ముగ్గురు జర్నలిస్ట్ కుటుంబాలకు లక్ష చొప్పున చెక్కుల పంపిణీ
ప్రజా సింగిడి మెదక్ జిల్లా స్టాపర్, తూప్రాన్ మే 9
మెదక్ జిల్లాలో ఇటీవలి కాలంలో వివిధ కారణాల చేత మరణించించిన ముగ్గురు జర్నలిస్టులకు తెలంగాణ మీడియా అకాడమీ జర్నలిస్టుల సంక్షేమ నిధి ద్వారా ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు మంజూరుకాగా, రాష్ట్ర రెవిన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డిల చేతుల మీదుగా చెక్కులు అందజేశారు. శుక్రవారం హైదరాబాద్ నాంపల్లిలో గల మీడియా అకాడమీ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా 38 మంది జర్నలిస్ట్ వివిధ కారణాల చేత మరణించగా వారి కుటుంబ సభ్యులకు, 8 మంది గాయపడిన, తీవ్ర అనారోగ్యానికి గురైన వారికి 50 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు.
మెదక్ జిల్లాకు సంబంధించి సందాయిపేట చంద్రశేఖర్ గౌడ్ (మెదక్ పట్టణం),
మల్లేశం (కుల్చారం),
రాజయ్య (తుప్రాన్) ఉన్నారు.
వీరి కుటుంబాల అకౌంట్ లో ఈనెల నుండి 3 వేల రూపాయల పింఛన్ జమ కావడం ప్రారంభమైంది. వీరి కుటుంబ సభ్యులకు లక్ష రూపాయల చొప్పున చెక్కులు అందజేశారు.
మరణించిన జర్నలిస్ట్ కుటుంబాలకు లక్ష చొప్పున ఆర్థిక సాయం మంజూరు చేయించిన మీడియా అకాడమీ చైర్మన్ పి. శ్రీనివాస్ రెడ్డి గారికి, సహకరించిన యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ గారికి టీయూడబ్ల్యూజె మెదక్ జిల్లా అధ్యక్షులు ఎ. శంకర్ దయాళ్ చారి, ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి. జి. శ్రీనివాస్ శర్మ, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు నాగరాజు, ఐ జె యూ సభ్యులు బుక్క అశోక్, రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి, మిన్పూర్ శ్రీనివాస్ లు కృతజ్ఞతలు తెలిపారు.




Post Comment