ముంచుకస్తున్న ముంథా తుఫాన్ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి*
*తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క సూచనా*
ప్రజా సింగిడి ప్రతినిధి తెలంగాణ స్టేట్. అక్టోబర్, 29.
* రైతులు వరి కోతలు వాయిదా వేసుకోవాలి. నదీ పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.తక్కువ ఎత్తు ప్రాంతాల ప్రజలు ముందస్తు చర్యలు చేపట్టాలి. రహదారులు, వంతెనలు, వాగులు దాటే సమయంలో జాగ్రత్త అవసరం. పిల్లలు, వృద్ధులు అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దు. తెగిపోయిన విద్యుత్ తీగలు, కూలిన చెట్ల వద్దకు వెళ్లకూడదు. కోసిన వరి పంటను సురక్షిత ప్రదేశాలకు తరలించి కవర్ చేయాలి. మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళవద్దు అనారోగ్యంతో ఉన్నవారు ఈ చల్లటి వాతావరణం వలన ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నందునా ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని ప్రజలను మంత్రి సీతక్క కోరారు




Post Comment