మహిళలే మహారాణులు…
మహిళలే మహారాణులు…
◆అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు..
◆ఎస్.జీ.టి.యు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు.
ప్రజా సింగిడి మెదక్ జిల్లా స్టాపర్, తూప్రాన్ మార్చ్. 15
మహిళలే మహారానులనీ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని తూప్రాన్ తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ జ్యోతి కృష్ణ అన్నారు. శనివారం ఎస్.జీ.టి.యు మెదక్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్.జీ.టి.యు ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఆద్యంతం మహిళా ఉపాధ్యాయులను ఉత్సాహపరుస్తు మహిళాల విశిష్టత గురించి వివరించారు.మెదక్ జిల్లా పక్షాన జిల్లా అధ్యక్షుడు జింక అశోక్, మహిళా ప్రధాన కార్యదర్శి మంజీరా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం శనివారం తూప్రాన్. లోని శివ శివని ఫంక్షన్ హాల్ లో జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా గ్రంథాలయ కమిటీ చైర్మన్ సువాసినీ రెడ్డి, తూప్రాన్ తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ మామిండ్ల జ్యోతి కృష్ణ, ఉట్నూర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మౌనిక లు హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా సమాజంలో మహిళా సాధికారత గురించి మహిళలు ఎదుర్కొంటున్న సవాల్ల గురించి మాట్లాడటం జరిగింది. మహిళలు అభివృద్ధి చెందినప్పుడే ఒక దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందని దానికి ప్రతి మహిళ ఒక అమ్మగా ఒక సంఘసంస్కర్త గా సమాజాన్ని ముందు తీసుకోవాలని కోరడం జరిగింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరికెల వెంకటేశం మాట్లాడుతూ మహిళలు అన్నిరంగాలలో ముందుకు రావాలని కోరడం జరిగింది. దీనికి ఎస్.జీ.టి.యు జిల్లా బాధ్యులు అరవింద, విజేత, శ్రీవేని, నర్మదా, జ్యోతి, శారద, పద్మ, తదితరులు పాల్గొన్నారు.




Post Comment