మద్యం సేవించి వాహనాలను నడపరాదు
హత్నూర ఎస్సైకే సుభాష్
హత్నూర మండలం ఏప్రిల్ 17 ప్రజా సింగిడి ప్రతినిధి
మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హత్నూర ఎస్సై కే. సుభాష్ హెచ్చరించారు. గురువారం కాసాల తెలంగాణ చౌరస్తా వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వాహనాలకు బ్రీత్ అనలైజర్ టెస్టులు నిర్వహించారు. వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించాలని సూచించారు. మైకం మత్తులో వాహనాలు నడిపితే అమూల్యమైన ప్రాణాలు తీసుకోవద్దని సూచించారు. ముఖ్యంగా యువకులు ఓవర్ స్పీడ్ తో వెళ్లొద్దని చెప్పారు ద్విచగా వాహనాలకు హెల్మెట్ ధరించాలని ఉన్నారు. నిబంధనలు పాటించని వాహనాలకు ఆన్లైన్ ద్వారా జరిమానా విధిస్తామన్నారు. హత్నూర పోలీస్ ఇబ్బంది
మల్లేశం రవి శివకుమార్ రాజేష్ ఉన్నారు.




Post Comment