మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
-మత్స్యశాఖ జిల్లా అధ్యక్షుడు గున్నాల నర్సింహులు
ప్రజా సింగిడి ప్రతినిధి హత్నూర, ఏప్రిల్ 22:
మత్స్యకారుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేస్తున్నాయని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు గున్నాల నర్సింహులు తెలిపారు. మంగళవారం మండల కేంద్రమైన హత్నూర రైతు వేదికలో హత్నూర మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మత్స్యశాఖ జిల్లా అధికారి ఆర్ఎల్. మధుసూధన్, కోఆపరేటివ్ సొసైటీ జిల్లా అధికారి కిరన్ కుమార్ లు హాజరయ్యారు. ఈసందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ మత్స్యకారులు ప్రభుత్వం అమలుచేసే ఆయాపథకాల ద్వారా ఆర్థికాభివృద్ధిని సాధించడానికి కృషిచేయాలన్నారు. అదేవిధంగా చేపల పెంపకం, మార్కెటింగ్ చేయడంలో అనుభవం కలిగివుండటం ద్వారా లాభాలు ఆర్జించవచ్చన్నారు. కొత్తగా సభ్యత్వాల కొరకు వృత్తినైపుణ్య పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాల్సి వుంటుందన్నారు. అనంతరం జిల్లా అధికారులు మాట్లాడుతూ మత్స్యకారులు క్రమం తప్పకుండా సొసైటీలలో సమావేశాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు రికార్డులు సక్రమంగా నిర్వహించాలన్నారు. . కోఆపరేటివ్ సొసైటీల ద్వారా అవసరం ఉన్న సంఘాలకు స్వయం ఉపాధినిమిత్తం రుణాలు మంజూరుచేయడానికి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకార సంఘాల బలోపేతానికి కృషి చేస్తున్నాయని వారు సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ వినయక్కుమార్, శ్రీనివాస్ రావు, హత్నూర సొసైటీ అధ్యక్షుడు బిక్షపతి, డైరెక్టర్లు, సభ్యులు పాల్గొన్నారు.




Post Comment