మంత్రి లోకేశ్ చేతిలో జూనియర్ ఎన్‌టీఆర్ ఫ్లెక్సీ…
మంత్రి లోకేశ్ చేతిలో జూనియర్ ఎన్‌టీఆర్ ఫ్లెక్సీ…
ప్రజా సింగిడి
జూనియర్ ఎన్‌టీఆర్ ఫ్లెక్సీని మంత్రి నారా లోకేశ్ ప్రదర్శించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏపీలోని కృష్ణా జిల్లా మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్కులో అశోక్ లేల్యాండ్ ప్లాంట్‌ను మంత్రి లోకేశ్ బుధవారం ప్రారంభించారు. ఆ మార్గంలో నూజివీడు మండలం సీతారాంపురం వద్ద ఆయనకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ క్రమంలో కార్యకర్తలు, అభిమానుల కోరిక మేరకు తారక్ ఫ్లెక్సీని చూపించి ఉత్తేజపరిచారు. దీంతో వారు కేరింతలు, ఈలలతో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట ప్రత్యక్షం కావడంతో వైరల్‌గా మారింది. దీనిపై నందమూరి అభిమానులు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.




Post Comment