మంత్రివర్గంలో మా సామాజికవర్గానికి అవకాశం కల్పించండి
ప్రజా సింగిడి ప్రతినిధి హైదరాబాద్. మర్చి, 26.
లంబాడీ సామాజిక వర్గానికి చెందిన ప్రభుత్వవిప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్, ఎమ్మెల్యేలు బాలు నాయక్ , మాలోత్ రాందాస్ సహా పలువురు నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గంలో తమ లంబాడీ సామాజిక వర్గానికి చోటు కల్పించాలని కోరుతూ రాసిన లేఖను సీఎంకు అందించారు. అలాగే రాష్ట్రంలో ఉన్న లంబాడీ సామాజిక వర్గం గత ఎన్నికల్లో పూర్తిగా కాంగ్రెస్ కు అండగా నిలచిందని ప్రస్తావించారు. 32 లక్షల జనాభా ఉన్న లంబాడీలకు మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ లంబాడీల అభివృద్ధికి సహకరిస్తుందని ఆశిస్తున్నామని వారు అన్నారు. మంత్రి వర్గ విస్తరణలో లంబాడీలకు స్థానం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే , కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లకు కూడా లేఖ రాశామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలిపారు.




Post Comment