భూ వివాదం వల్ల రెండు కుటుంబాల మధ్య గొడవ
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. ఏప్రిల్, 8.
భూమి విషయం లో ఇరు వర్గాలు ఘర్షణకు పాల్పడిన ఘటన శివ్వంపేట మండలం ఉసిరికపల్లి గ్రామంలో చోటు చేసుకుంది ఎస్ ఐ తెలిపిన వివరాల ప్రకారం అదే గ్రామానికి చెందిన దుర్గ రెడ్డి, గుర్రం సంజీవ రెడ్డి కుటుంబాల మధ్య భూమి విషయం లో తరుచుగా గొడవలు జరుగుతుందేవి అని 6-4-25 నాడు సుమారుగా ఉదయం 7 గంటల సమయంలో సంజీవ రెడ్డి కి సంబంధిచిన బోరు మోటారు గుంతలో పడవేశారు అని దుర్గ రెడ్డి కుటుంబాన్ని చూసుకుంటూ దూర్బాషాలాడుతున్న సమయం లో దుర్గ రెడ్డి కొడుకు మమ్మల్ని చూసి ఎందుకు తిడుతున్నావ్ అని అడుగగా మిరే నా బోరు మోటారును పడేసారు అందుకే తిడుతున్న అని చెప్పగా మరుసటి రోజు సాయంత్రం సుమారుగా 6గంటల సమయంలో దుర్గ రెడ్డి భార్య, కొడుకు పొలం పనుల నిమిత్తం పొలానికి వెళ్తుండగా మార్గ మధ్యలో రుక్మ రెడ్డి సంజీవ రెడ్డి మరి కొందిరితో కలిసి దుర్గ రెడ్డి భార్య ని కొడుకు ని కొట్టుతుండగా ఆపడానికి వచ్చిన దుర్గ రెడ్డిని కూడా కొట్టరాని ప్రమీల పిర్యాదు చేయగా ధర్యాప్తు చేస్తున్నాం అని శివ్వంపేట ఎస్ ఐ తెలిపారు




Post Comment