భూ భారతి చట్టం పై అవగాహన సదస్సు
ప్రజా సింగిడి ప్రతినిధి డోర్నకల్. ఏప్రిల్, 24.
డోర్నకల్ మండలం గొల్లచర్ల క్రాస్ రోడ్ సమీపంలోని విజయ ఫంక్షన్ హాల్‌లో గురువారం భూ భారతి చట్టం పై అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ మరియు డోర్నకల్ శాసనసభ్యులు డా. రాంచంద్రు నాయక్ హాజరై, భూసంబంధిత అంశాలపై వివరంగా ప్రసంగించారు.సదస్సులో జిల్లా కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, ఆర్‌డిఒ, ఎంఆర్‌ఓ, ఎంపీడీఓ తదితర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. అలాగే, మండల పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, మండల నాయకులు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.




Post Comment