భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్
ఆధారాలతో దరఖాస్తు సమర్పించండి
సమస్యల సత్వర పరిష్కరానికి సహకరించండి
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
ప్రజాసింగిడి మెదక్ జిల్లా ఉమ్మడి ప్రతినిధి మే 5
మెదక్ జిల్లా చిల్పిచేడ్ మండలం లోభూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా చిల్పిచేడ్ మండలంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. భూ భారతీ పైలట్ ప్రాజెక్ట్ రెవెన్యూ సదస్సులో భాగంగా సోమవారం మెదక్ జిల్లా చిలిపి చేడు మండలం రహీం గూడ, రాందాస్ గూడ గ్రామాలలో నిర్వహించిన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. రైతులతో ముఖాముఖి మాట్లాడి, వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. భూ భారతి చట్టంపై అవగాహన కల్పించి, రైతుల సందేహాలను నివృత్తి చేశారు.
ఈ సందర్భంగా సదస్సు నిర్వహణ కోసం చేసిన ఏర్పాట్లను నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ, హెల్ప్ డెస్క్, జనరల్ డెస్క్ ల వద్ద సదుపాయాలు, సిబ్బంది పనితీరును పరిశీలన జరిపి, అధికారులకు పలు సూచనలు చేశారు. అర్జీలు సమర్పించేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. భూ సంబంధిత సమస్యలు ఉన్న వారు నిర్ణీత ప్రొఫార్మా లో దరఖాస్తు చేసుకునేలా సహకారం అందించాలని హెల్ప్ డెస్క్ సిబ్బందిని ఆదేశించారు.దరఖాస్తులను వెంటవెంటనే పరిశీలిస్తూ, సత్వర పరిష్కారానికి అనువుగా ఉన్న వాటిని తహసీల్దార్ దృష్టికి తెచ్చి అప్పటికప్పుడే పరిష్కారం జరిగేలా చూడాలన్నారు. పైలెట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తున్న రెవెన్యూ సదస్సులను చిల్పిచేడ్ మండల రైతులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. పైలెట్ మండలంలో సదస్సులు పూర్తయ్యాక, జిల్లాలోని అన్ని మండలాలలో రెవెన్యూ గ్రామాల వారీగా సదస్సులు నిర్వహిస్తారని అన్నారు.
ఎమ్మెల్యే సునీత రెడ్డి మాట్లాడుతూ..
మెదక్ జిల్లాలో భూభారతిలో పైలెట్ ప్రాజెక్టుగా చిలప్ చెడ్ మండలం ఎంపిక కావడం మండల వాసుల అదృష్టం అన్నారు
రైతులు యొక్క ప్రతి సమస్య పరిష్కారం కావాలన్నారు.ఎమ్మెల్యే సునీత రెడ్డి మండలంలోని గన్య తాండలో భూ సమస్య బాగుందని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు ఈ సదస్సులో నర్సాపూర్ ఆర్టీవో మహిపాల్ రెడ్డి, తహశీల్దార్ ఆంజనేయులు, సెక్రెటరీ సంజీవులు, డిప్యూటీ తాసిల్దార్ సఫి,
రెవిన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




Post Comment