భక్తుల సౌకర్యార్థం రాజ గోపురం నుండి గుడి వరకు చలువ పందిళ్ళు ఏర్పాటు -కలెక్టర్ రాహుల్ రాజ్
ప్రజాసింగిడి మెదక్ జిల్లా ఉమ్మడి ప్రతినిధి మార్చ్ 19
మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గ మాత అమ్మవారి దేవాలయ పరిసర ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్
వేసవి తాపాన్ని దృష్టిలో పెట్టుకుని భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంగా రాజగోపురం నుండి గుడి వరకు చలువ పందిళ్లు, ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టామని,కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు.
బుధవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గా మాత అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని కలెక్టర్
సంబంధిత తాసిల్దార్, ఆలయ అర్చకులు, సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. దేవాలయ ప్రాంగణం అంతా కలియతిరిగి భక్తులు దర్శనానికి ఏ రోజు ఎంత మంది వస్తున్నారు, మంగళ, శుక్ర, ఆదివారం భక్తుల రద్దీ, సౌకర్యాల గురించి కలెక్టర్ ఆలయ నిర్వాహకులు, తాసిల్దార్స్ ను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేసవి కాలంలో భక్తులకు ఎండ నుండి ఉపశమనం కలిగించడం కొరకు త్రాగునీరు .చలువ పందిళ్లు నిర్మాణం ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేసి భక్తులకు ఉపయోగాలకు తీసుకురావాలని, త్రాగునీరు అందుబాటులో ఉంచాలని
సౌకర్యాలపై దృష్టి సారించాలని హితవు పలికారు.
- ఈ కార్యక్రమంలో పాపన్నపేట తాసిల్దార్ సతీష్, ఆలయ ప్రధాన పూజారి శంకర్ తదితరులు పాల్గొన్నారు




Post Comment