భక్తులు అందరూ విగ్రహ ఊరేగింపులో పాల్గొనాలి
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. ఏప్రిల్, 23.
గూడూరు లో నిర్మిస్తున్న శ్రీ గురూపీఠం విగ్రహలు జైపూర్ నుండి బయలుదేరిన శ్రీ దత్తాత్రేయ స్వామి సహిత విగ్రహాలు గురువారం రోజున శ్రీ గురు పీఠంకు చేరుతున్నందున గురువారం సాయంత్రం 5గం.లకు శివ్వంపేట బస్టాండ్ నుండి ప్రారంభమయ్యే ఊరేగింపులో మహిళలు పురుషులందరూ సాంప్రదాయ దుస్తులు ధరించి పాల్గొనాలని భక్తులందరూ శ్రీ మహా దత్తాత్రేయ స్వామి పరంపర గురువులందరినీ భక్తిశ్రద్ధలతో సుస్వాగతం పలకాలని ముఖ్యంగా గూడూరు మరియు శివంపేట గ్రామ ప్రజలందరూ రాజకీయాలకతీతంగా భగవంతుని ముందు అందరి సమానులనే ఉద్దేశంతో ఈ ఊరేగింపులో పాల్గొనాలని, పరంబ్రహ్మ స్వరూపమైన శ్రీమన్నారాయణ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంలో దత్తాత్రేయుడుగా అవతరించి సకల లోకాల్లో నిరంతరం సంచరిస్తూ భక్తులను అనుగ్రహిస్తున్నారు. మన పూర్వజన్మ సుకృతం వల్ల దత్తాత్రేయ స్వామి కలియుగ అవతారులు అందరూ మన గ్రామానికి రావడం మనం ఏ జన్మలో చేసుకున్న పుణ్యఫలం. భక్తులందరూ కుటుంబ సమేతంగా ఆ దత్తాత్రేయని ఆశీస్సులు పొందాలని ఈ సదవకాశాన్ని మండలంలోని భక్తులందరూ వినియోగించుకోవాలని స్వామివారికీ ఊరేగింపుగా రేపు గూడూర్ పవిత్రమైన సాయిబాబా దత్తాత్రేయ స్వామి ఆలయానికి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరం కలిసి ముఖ్యంగా మహిళలు మంగళ హారతులు, నీళ్ల చాకలు పెడుతూ పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకువచ్చి వాటిని నూతన ఆలయం వద్ద పెట్టడం జరుగుతుంది. తర్వాత వాటిని ప్రతిష్ట సమయము తెలుపడం జరుగుతుంది. కాబట్టి విగ్రహాల ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ ఊరేగిoపులో మన గ్రామ ప్రజలు మరియు అక్క చెల్లెల్లు అన్నదమ్ములు కలిసి శ్రీ సాయిబాబా మరియు దత్తాత్రేయ స్వామి అనుగ్రహం పొందగలరని స్వాగతించాలని శ్రీ గురు పీఠం ట్రస్ట్ గూడూరు తరపున శ్రీనివాస్ గౌడ్ శ్రీ గురు పీఠం ట్సస్ట్ సభ్యులు మాజీ సర్పంచ్ గూడూరు విజ్ఞప్తిచేశారు




Post Comment