బోరు వేసుకునే విషయంలో అన్నదమ్ములు గొడవ ఇద్దరిని రిమాండ్
బోరు వేసుకునే విషయంలో అన్నదమ్ములు గొడవ
ఇద్దరిని రిమాండ్ తరలించిన పోలీసులు.
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. మర్చి, 20.
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం తిమ్మాపూర్ గ్రామంలో రెండు గంటల సమయంలో తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బాలయ్య అతని తమ్ముడు బిక్షపతికి బోరు వేసుకునే విషయంలో ముందు రోజు రాత్రి గొడవ జరిగింది. బాలయ్య బోరు వేసుకోకుండా దారి యందు నీళ్లు పెట్టినాడని దానిపై ఇరువురికై గొడవ జరిగి ఎవరి ఇంటికి వారు వెళ్ళినారు కానీ బిక్షపతి తన ఇద్దరు కొడుకులైన ప్రసాద్ మరియు రాజులను రాత్రి సుమారుగా రెండు గంటల సమయంలో పిలిపించు కొని వీరు ముగ్గురు కలిసి బాలయ్య ఇంట్లోకి అక్రమంగా చొరబడి ఇటుక పేల్లలు మరియు ఇనుపరాడులతో విచక్షణారహితంగా బాలయ్య మరియు తన భార్య మరియు తన ఇద్దరు కొడుకులు కోడలు తలపై మరియు కాళ్లు చేతులపై కొట్టి చంపడానికి ప్రయత్నించినారని శివంపేట పోలీస్ స్టేషన్ లోని ఎస్సై మధుకర్ రెడ్డికి దరఖాస్తు ఇవ్వగా దానిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి నిందితులైన బిక్షపతి మరియు అతని కుమారులు ప్రసాద్ రాజులను అరెస్టు చేసి మెదక్ కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు పంపించడం జరిగింది. శివంపేట ఎస్సై మధుకర్ రెడ్డి తెలిపారు.




Post Comment