బిఆర్ఎస్ మహాసభను విజయవంతం చేయాలి.
* మండల అధ్యక్షులు బొల్లంపల్లి బాబుల్ రెడ్డి*
ప్రజా సింగిడి మెదక్ జిల్లా స్టాపర్,తూప్రాన్, ఏప్రిల్ 27
తూప్రాన్ మండల పరిధిలోనీ బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు బొల్లంపల్లి బాబుల్ రెడ్డి నేతృత్వంలో జరిగిన సన్నాహక సమావేశాలను ఏర్పాటు చేస్తూ వరంగల్ మహాసభను విజయవంతం చేయవలసిందిగా కోరినారు ఇందుకు అనుగుణంగా ఆదివారం రోజున తూప్రాన్ మండలంలోని యావాపూర్ గ్రామంలో బిఆర్ఎస్ నాయకులు చేరి బిఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వరంగల్ లో జరుగు మహా సభకు భారీ ఎత్తున తరలినారు. ఈ సందర్భంగా బొల్లంపల్లి బాబుల్ రెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకపోవడం సిగ్గుచేటని తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి తీరని నష్టాన్ని కలుగజేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న స్థానిక ఎన్నికల సమరంలో తెలంగాణ ప్రజానీకం సరైన రీతిలో గుణపాఠం చెప్పే విధంగా వరంగల్ లో ఏర్పాటు చేసిన మహాసభను విజయవంతం చేయడానికి బయలుదేరడం జరుగుతుందని తెలిపారు. ఇందులో సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ శేరి నరసింహారెడ్డి, సురేందర్ రెడ్డి, పిట్ల సింహం, చాకలి భూములు, కార్యకర్తలు, యువకులు, ప్రజలు భారీగా తరలినారు.




Post Comment