బాబు జగ్జీవన్‌రామ్ ఫోటోకు పూలమాల వేసి ఘన నివాళ్లు
సంగారెడ్డి జిల్లా ఎస్ పి పరితోష్ పంకజ్
ప్రజా సింగిడి ప్రతినిధి సంగారెడ్డి. ఏప్రిల్, 5.
స్వాతంత్ర్య సమరయోధులు, సంఘ సంస్కర్త బాబు జగ్జీవన్‌రామ్ జయంతిని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ బాబు జగ్జీవన్‌రామ్ ఫోటోకు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. బాబు జగ్జీవన్‌రామ్ 1908లో బీహార్ రాష్ట్రంలోని ఒక చిన్న గ్రామంలో జన్మించారని, ఆయన చిన్నప్పటినుండే అన్యాయాలకు, కులవివక్షకు ఎదురునిలబడి, చదువులో ప్రతిభ చూపుతూ, సమాజాన్ని మార్చాలనే సంకల్పంతో ముందుకెళ్లారు అన్నారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన చురుకుగా పాల్గొన్నారు. స్వతంత్ర్యానంతరం రక్షణ శాఖ మంత్రిగా పదవి అధిష్టించి, దేశానికి ఎంతో సేవ చేశారు.బాబు జగ్జీవన్‌రామ్ జీవితమే ఒక పాఠశాల వంటిది. సామాజిక న్యాయం కోసం, పేద ప్రజల కోసం, వెనుకబడిన తరగతుల కోసం ఆయన పోరాడిన తీరు మనందరికీ ఆదర్శప్రాయం అని, మనం కూడా ఆయన ఆశయాలను స్మరించుకుంటూ, సమానత్వం, సోదరత్వం కలిగిన సమాజ నిర్మాణం కోసం ప్రయత్నించారని ఎస్పీ అన్నారు. ఆ మహానీయులను స్మరింస్తూ.. మాతృదేశానికి మన వంతు సేవ చేయడమే స్వాతంత్ర్య.సమరయోధులకు మనం ఇచ్చే నిజమైన నివాళి అన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎ.సంజీవరావ్, సంగారెడ్డి డియస్పీ సత్తయ్య గౌడ్, ఎఆర్.డియస్పీ నరేందర్, యస్.బి. ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణ, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, ఆర్.ఐ.లు రాజశేఖర్ రెడ్డి, డానియోల్, యస్.బి. ఎస్ఐ యాదవ రెడ్డి, డీసీఆర్బీ ఎస్ఐ బక్కయ్య, సత్యనారాయణ, పెంటయ్య మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




Post Comment