భధ్రత లేని చండిక మాత ఆలయం
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. మర్చి, 28.
చండిక మాత ఆలయం లో చోరి అయినా సంఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చండి గ్రామం లో చోటుచేసుకుంది శివ్వంపేట ఎస్ ఐ మధుకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఆలయ చైర్మన్ తేది 27/3/2005 నాడు గుడిముందు గల సీసీ రోడ్లుకు నేను నీళ్లు పట్టడానికి వెళ్ళి రాత్రికి సుమారుగా7:30 కి గుడికి తాళం వేసి ఇంటికి వెళ్ళిపోయాను. తిరిగి శుక్రవారం నాడు ఉదయం సుమారుగా 6:30కి నేను గుడి వద్ద నీళ్లు పట్టడానికి వెళ్ళగా అక్కడ గుడి తాళం పగలగొట్టబడి ఉంది మరియు రెండు సీసీ కెమెరాలు కూడా పగిలిపోయి ఉన్నాయి.వెంటనే నేను గ్రామస్థులకు తెలిపినాను. నేను మరియు నాతో పాటు బస్యన్నగారి కరుణాకర్ గడిలో పలికి వెళ్ళి చూడగా, గుడి లోపల ఉన్న సామాగ్రి చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. అందులో నుండి ఎటువంటి విలువైన వస్తువులు పోలేదు. ఎవరో గుర్తు తెలియని దొంగలు చండికామాత గుడిలో దొంగతనం చేయడానికి ప్రయత్నించా రాని విషయంపై ఆలయ చైర్మన్ పిర్యాదు చేయగా ధర్యాప్తు ప్రారంభించం అని శివ్వంపేట ఎస్ ఐ మధుకర్ రెడ్డి తెలిపారు




Post Comment