ఢిల్లీ బయలుదేరిన మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ .
ప్రజా సింగిడి ప్రతినిధి మెదక్. మర్చి, 26.
డిల్లీలో ఏఐసీసీ అగ్రనేతలతో జరిగే తెలంగాణ డీసీసీ అధ్యక్షుల సమావేశనికి డిల్లీ బయలుదేరిన మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ .ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ .ఈ సందర్భంగా పద్దెనిమిదేళ్ల తర్వాత జిల్లా అధ్యక్షులతో ఏఐసీసీ మీటింగ్స్ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ కార్యకర్తల కష్టంతోనే అధికారంలోకి వచ్చామన్న విషయాన్ని నాయకులు గుర్తుంచుకోవాలన్నారు. ప్రతి నాయకుడు కార్యకర్తకు అండగా నిలబడుతూ సంపూర్ణ సహకారం అందించాలని సూచించారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి నాయకుడు తీసుకోవాలన్నారు.కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని ప్రతి నాయకుడు కార్యకర్తకు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో తోడుండాలన్నారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలకు అవకాశాలు కల్పించి వారిని నాయకులుగా తయారు చేయాల్సిన బాధ్యత మనపైనే ఉందన్నారు. నాయకులంతా కలిసికట్టుగా పనిచేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో కి తీసుకెళ్తే ప్రజల మద్దతు లభించి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నారాయణఖేడ్ ప్రశాంత్ రెడ్డి, మహబూబ్నగర్ మధుసూదన్ రెడ్డి, వనపర్తి రాజేంద్రప్రసాద్, ఖమ్మం దుర్గాప్రసాద్, ఖమ్మం పట్టణాధ్యక్షులు జావిద్, నల్గొండ ఎమ్మెల్సీ శంకర్ నాయక్, బాణాల మోహన్ రెడ్డి, కరీంనగర్ నరేందర్ రెడ్డి నిజాంబాద్ శ్రీను వేణు, పట్టణ అధ్యక్షులు తదిరులు పాల్గొన్నారు.




Post Comment