బండారి గంగాధర్ కు శ్రీ రేణుక ఎల్లమ్మ ప్రతిష్టాపన ఆహ్వాన పత్రిక
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. మే, 29.
మెదక్ జిల్లా శివంపేట్ మండల్ పిల్లుట్ల గ్రామంలో నూతనంగా నిర్మించినటువంటి శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ ప్రతిష్టాపన మహోత్సవానికి ముఖ్య అతిథులుగా గౌడ సంఘం ఆధ్వర్యంలో బీసీ నాయకులు జాతీయ సేవారత్న అవార్డు గ్రహీత ప్రముఖ సంఘ సేవకులు బండారి గంగాధర్ కి ఆహ్వాన పత్రిక అందజేయడం జరిగింది. అలాగే అమ్మవారి 4.5.6.7 తేదీల్లో జరగబోయే ఉత్సవాలు ధ్వజస్తంభ ప్రతిష్టాపన. గణపతి పూజ. అగ్ని ప్రతిష్టాపన .జలాధివాసం. కల్యాణ హోమాలు. మండప పూజలు. శాంతి హోమాలు. మహాబలి నివేదన.కుంభాభిషేకం .మరియు ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవానికి కుటుంబ సమేతంగా వచ్చి ముఖ్య అతిథులుగా హాజరై మీయొక్క సహాయ సహకారాలు అందించాలని అమ్మవారి దర్శన భాగ్యం చేసుకోవాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద గౌడ్ బుర్ర పోచ గౌడ్ . బుర్ర తిరుపతి గౌడ్ . బుర్ర పోచ గౌడ్ . బొందిలా శ్రీనివాస్ గౌడ్ . కర్రే ఆంజనేయులు గౌడ్ . బుర్ర శ్రీనివాస్ గౌడ్ . బుర్ర మహేష్ గౌడ్ గారు. బుర్ర అనిల్ గౌడ్ . బాసంపల్లి శ్రీధర్ గౌడ్. బిజీ ఆర్ యువసేన అధ్యక్షులు కుమ్మరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.




Post Comment