బంజారా లంబాడి భాషను గుర్తించడం సంతోషకరం…
బంజారా లంబాడి భాషను గుర్తించడం సంతోషకరం…
◆లంబాడ లైవ్ ఐక్యవేదిక ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్ .
ప్రజా సింగిడి హనుమకొండ జిల్లా మార్చి 30:
హనుమకొండ జిల్లా గుండ్ల సింగారం విలేజ్ లో లంబాడ లైవ్ ఐక్యవేదిక ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్ మాట్లాడుతూ ప్రజలు మాట్లాడే గోర్ బోలి భాషను రాజ్యాంగం లోని 8 ఎనిమిదో షెడ్యూల్లో చేర్చాలని ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానించడం సంతోషకరమని రాష్ట్రంలో 40 లక్షల పైగా ఉన్న బంజారా గిరిజనులను భాషను గుర్తించి ప్రత్యేక హోదా కోసం తీర్మానించిన ప్రభుత్వానికి రుణపడి ఉంటామన్నారు గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ అమలు చేయాలన్నారు రాష్ట్రం బంజారాలు 40 లక్షల పైగా ఉన్న జనాభా కాబట్టి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వం నుంచే వచ్చే సబ్సిడీ పథకాలను అమలు చేయాలని ఎస్టీ కార్పొరేషన్ లో ఉన్న గత బకాయి చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది లంబాడా లైవ్ ఐక్యవేదిక ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా రాజు నాయక్ ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ కన్వీనర్ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.




Post Comment