ఫిటినెస్ లేని బస్సులు రోడ్డెక్కితే సిజ్…
ఫిటినెస్ లేని బస్సులు రోడ్డెక్కితే సిజ్…జిల్లా రవాణా అధికారి Srinivas reddy
ప్రజా సింగిడి, కామారెడ్డి
కామారెడ్డి జిల్లా లోని విద్యా సంస్థల బస్సు (డ్రైవర్లు, యాజమాన్యాలకు అవగాహన కార్యక్రమం ఈ నెల 11 వ తేదీన నాడు ఉదయం 11 గంటలకు లిటిల్ స్కాలర్స్ స్కూల్, కామారెడ్డి నందు నిర్వహించరూ.
ఈ సందర్భముగా జిల్లా రవాణా అధికారి కే. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో స్కూల్ బస్సు ప్రమాదాలు జరకుండా డ్రైవర్లు, యాజమాన్యం తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. స్కూల్ వద్ద పిల్లలు రోడ్డు దాటునపుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఫిటినెస్ లేని బస్సులను పిల్లలను తరలించడానికి ఉపయోగించరాదని, ఫిటినెస్ లేని బస్సులు రోడ్డెక్కితే జప్తు చేసి కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమములో రవాణా శాఖ సిబ్బంది జె.శ్రీనివాస్, ఆర్. నాగలక్ష్మి, కానిస్టేబుల్స్ హెూమ్ గార్డ్స్, 100 మంది స్కూల్ బస్సు డ్రైవర్లు, స్కూల్ యాజమాన్యాలు పాల్గొన్నారు.




Post Comment