ఫింగర్ ప్రింట్ లైవ్ స్కానర్, ఎం.ఎస్.సి.డి పాపిలోన్ డివైస్ పై సిబ్బందికి శిక్షణ తరగతులు
జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
ప్రజాసింగిడి ప్రతినిధి సంగారెడ్డి. ఏప్రిల్, 17.
ఫింగర్ ప్రింట్ లైవ్ స్కానర్ మరియు ఎం.ఎస్.సి.డి పాపిలోన్ డివైస్ వినియోగం గురించి జిల్లా పోలీసు స్టేషన్ లలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి రెండు రోజుల శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని, రెండవ రోజు శిక్షణలో భాగంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ప్రత్యేకంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఫింగర్ ప్రింట్ లైవ్ స్కానర్ మరియు ఎం.ఎస్.సి.డి పాపిలోన్ డివైస్ ట్రైనింగ్ ను సద్వినియోగం చేసుకోవాలని, ఈ డివైస్ ల వినియోగం గురించి ఎలాంటి సందేహాలున్న ఈ శిక్షణ తరగతులలో నివృత్తి చేసుకోవాలని అన్నారు. సిబ్బంది ప్రతి ఒక్కరూ ఈ ఫింగర్ ప్రింట్ లైవ్ స్కానర్ మరియు ఎం.ఎస్.సి.డి పాపిలోన్ డివైస్ ల పై నైపుణ్యత కలిగి తమ,తమ పోలీసు స్టేషన్ లలో నమోదు అవుతున్న వివిధ రకాల ఆస్థి సంబంధిత నేరాలు, సస్పెక్ట్ చెక్ మరియు గుర్తు తెలియని మృతదేహాలను పింగర్ ప్రింట్స్ సేకరించి, కేసుల చేదనకు కృషి చేయాలని ఎస్పీ సిబ్బందికి సూచించారు.అనంతరం సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ కూడా తమ విధులలో పూర్తి నిబద్దతితో పని చేయాలని, తమకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహిస్తూ అధికారుల మన్ననలు పొందాలని అన్నారు. ప్రతి ఒక్కరూ తమన తమ విధుల పట్ల శ్రద్ధవహించి, పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.అనంతరం ఫింగర్ ప్రింట్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర రావ్, సబ్-ఇన్స్పెక్టర్ పింకీ కుమారి మరియు సిబ్బంది సేవలు అభినందనీయమని, జిల్లాలో ఎన్నో ఆస్తి సంబధిత నేరాలను, గుర్తు తెలియని మృతదేహాలను పింగర్ ప్రింట్స్ ఆధారంగా గుర్తించడం జరిగిందిని, వీరి సేవలను అభినందించారు.ఈ రెండు రోజుల శిక్షణ తరగతులలో ఇన్స్పెక్టర్ నాగేశ్వర రావ్, సబ్-ఇన్స్పెక్టర్ పింకీ కుమారి, జయసింహ పిసి ప్యాకల్టీ గా సిబ్బందికి ప్రింట్ లైవ్ స్కానర్ మరియు ఎం.ఎస్.సి.డి పాపిలోన్ డివైస్ నైపుణ్యత పై శిక్షణను ఇవ్వడం జరిగింది.




Post Comment