ప్రవేట్ పాఠశాలలో ఫీజుల దోపిడీ…
ప్రవేట్ పాఠశాలలో ఫీజుల దోపిడీ…
◆అల్లూరి ముదిరాజ్
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో TGVP శాఖ ఆధ్వర్యంలోప్రెస్ మీట్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రవేట్ పాఠశాలలో ఫీజుల దోపిడీతో పాటు, యూనిఫామ్, షూస్, టైప్, బెల్ట్ అంటూ విచ్చలవిడిగా అధిక ధరలకు విక్రయిస్తూ దోపిడి చేస్తున్నారు. TGVP తెలంగాణ విద్యార్థి పరిషత్ జిల్లా అధ్యక్షుడు అల్లూరి ముదిరాజ్ మాట్లాడుతూ విద్య హక్కు చట్టం ప్రకారం నిబంధనలకు అనుకూలంగా తక్కువ ధరలకు అమ్మాల్సిన పుస్తకాలని, ధనార్జనే ధైర్యంగా అధిక ధరలకు విక్రమిస్తూ బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నారు. అనుమతులు లేని పాఠశాలలు సైతం కొత్త అడ్మిషన్లు తీసుకుంటూ పుస్తకాలు విక్రయిసున్నా కూడా విద్యాశాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. పాఠశాలల యజమాన్యాలు బయట షాపులలో మాట్లాడుకుని వారి చేత విక్రయిస్తూ. విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేసి అక్కడికే పంపిస్తున్నారు. విద్య సంవత్సరం ప్రారంభం కాకముందు నుండి పుస్తకాలు, యూనిఫామ్ అధిక ధరలకు విక్రమిస్తున్న పాఠశాలపై చర్యలు తీసుకోవాలని విద్యశాఖ అధికారులకు డిమాండ్ జరిగింది. ఏదైతే అనుమతి లేని పాఠశాలలు. పుస్తకాలు. యూనిఫామ్. అధిక ధరలకు విక్రయిస్తున్న పాఠశాలపై చర్యలు తీసుకోకపోతే TGVP తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున డీఈవో కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో TGVP జిల్లా అధ్యక్షుడు అల్లూరి ముదిరాజ్, టౌన్ ప్రెసెంట్ విజయ్, రాజు, భాస్కర్, అశోక్, రమేష్, సంఘం నాయకులు పాల్గొన్నారు.




Post Comment