ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలు పెంచేందుకు వైద్యులు,వైద్య సిబ్బంది కృషి చేయాలని
రోజూ వారి మెనూని పక్కాగా అమలు చేయాలి
మెదక్ కలెక్టర్ రాహు ల్ రాజ్
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. మర్చి, 25.
ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలు పెంచేందుకు వైద్యులు,వైద్య సిబ్బంది కృషి చేయాలని,రోజువారి మెనూను పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు.మెదక్ జిల్లా శివ్వంపేట మండలం లోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని,కస్తూరిబా గాంధీ విద్యాలయాన్ని మంగళవారం కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా శివ్వంపేట మండలంలో దవాఖానలోని ఓపీ రిజిస్టర్ ను తనిఖీ చేశారు.ప్రతి నెలా ప్రభుత్వ,ప్రైవేట్ హాస్పిటల్ లలో అవుతున్న ప్రసవాల పై వివరాలు.కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు గర్భిణులు ప్రభుత్వ దవాఖానలకు వచ్చేలా అవగాహన కల్పించాలని వివరించారు.ఆసుపత్రిని ఎల్లవేళల పరిశుభ్రంగా ఉంచాలని,వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ అందుబాటులో ఉండాలన్నారు.పురుషుల వార్డ్ లను కలెక్టర్ సందర్శించి రోగులను పలకరించారు.ఎలా ఉన్నారు, ఎక్కడినుండి వచ్చారు,వైద్యం అందుతున్నదా,డాక్టర్ లు వస్తున్నారా,రోజులో ఎన్ని సార్లు వస్తున్నారు అని అడిగి తెలుసుకున్నారు,ఆసుపత్రిని ఎల్లవేళల పరిశుభ్రంగా ఉంచాలని,వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ అందుబాటులో ఉండాలన్నారు.అనంతరం మండలంలో కస్తూరిబా గాంధీ విద్యాలయాన్ని కలెక్టర్ పరిశీలించారు ముందుగా విద్యార్థులకు అందుతున్న మెనూ పరిశీలించి స్టోర్ రూమ్ లో పప్పు దినుసులు,కూరగాయలు నాణ్యతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం తయారు చేయాలని,నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా అనుసరించాలని, సమయానుగుణంగా రుచికరమైన పోషకాహారాన్ని విద్యార్థినిలకు ఇవ్వాలని అన్నారు,ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరు రిజిస్టర్ లను తనిఖీ చేసి,సమయపాలన ఖచ్చితంగా పాటించాలని సూచించారు,అనంతరం తరగతి గదులలో విద్యార్థినిల విద్య సామర్థ్యాలను ప్రశ్నలతో జవాబులతో పరీక్షించారు.
విద్యాభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని,విద్యకు ప్రాధాన్యత ఇవ్వడంతో సమాజం బాగుపడుతుందని తెలిపారు,
ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు గుణాత్మక విద్యతోపాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు.కస్తూరిబా గాంధీ విద్యాలయం పరిశుభ్రతకు, విద్యార్థుల భద్రతకు అధిక ప్రాధాన్యత పై దృష్టి సారించాలన్నారు.ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్లు, కస్తూరిబా గాంధీ విద్యాలయం మున్సిపల్ సంబంధిత ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.




Post Comment