ప్రపంచ దేశాల ముందు భారత్ పరువు తీసిన MODI…
ప్రపంచ దేశాల ముందు భారత్ పరువు తీసిన మోడీ…
◆మంత్రి జూపల్లి కృష్ణారావు
ప్రజా సింగిడి, కామారెడ్డి జిల్లా 29 మే:
ఈ రోజు పిసిసి ఆదేశాల మేరకు
కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు అధ్యక్షతన కామారెడ్డి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా
జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు గారు మరియు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు. జిల్లా ఇన్చార్జ్ అబ్జర్వేర్ లు. సత్యనారాయణ గౌడ్. వేణుగోపాల్ యాదవ్ లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ..
అభివృద్ధి చేయడంలో పోటీపడాలే తప్ప అడ్డుకోవడంలో కాదు.కామారెడ్డి అభివృద్ధికి ముందుండి కలిసి రావాలి తప్ప అడ్డు కోవడానికి ముందు కాదు.ఈరోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన నిర్వహించి దేశానికే ఆదర్శంగా నిలిచింది.
ప్రజలు మనల్ని నాయకులుగా ఉన్నందుకు ప్రజల సమస్యలు తీర్చడానికే ఎక్కువ సమయం ఇవ్వాలని, అప్పుడే ప్రజా నాయకులం అవుతాం తప్ప పదవుల కోసం పాకులాడితే కుదరదని అన్నారు.
ఈరోజు బీజేపీ రాష్టానికి చేసిందేమీ లేదు. ప్రజలను రెచ్చగొట్టి అధికారం లోకి రావాలని చుస్తుంది తప్ప ప్రజలకోసం పనిచేయడం లేదు.
పెహల్ గావ్ లో ఉగ్రవాదులు డాడీ చేసి అమాయకులను పొట్టన పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ ఉగ్రవాదంపై ఎలాంటి చర్యతీసుకున్న
కేంద్రానికి అండగా ఉంటామని మా అధిష్ఠానం మద్దతు తెలిపిందని అన్నారు.
డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసాడని కాల్పులు విరమించి వెనక్కి తగ్గి మాసైనికుల ఆత్మ స్టైర్యని దెబ్బ తీశారు.1971 అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ
పరాయి దేశాలు మా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని ఎవరికి తలొగ్గకుండా యుద్ధం చేసి
95వేల పాక్ సైనికులను బందీ లను
చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది ఇందిరా గాంధీ ది అన్నారు.ఇవన్నీ మనం ప్రజలకు చెప్పాలి.చిన్న చిన్న గొడవలు పక్కన పెట్టీ రాబోయే ఎన్నికల్లో ముందుకు వెళ్ళాలి.
మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ…
ప్రపంచ దేశాల ముందు భారత్ పరువు తీసిన మోడీ…
అమెరికా ఆదేశించిందని మన ఆడబిడ్డల సింధూరాన్నీ తుడిచిన వారినీ ఆపరేషన్ సింధూర్ తో బుద్ధి చెప్పకుండా మధ్యలో నిలిపేశాడు.
ప్రజలకు సేవ చేసే విధంగా కాంగ్రెస్ నాయకులు లక్ష్యం పెట్టుకోవాలి.
యంత్రాంగం లో జరిగే తప్పులను సరిచేస్తూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి.చిన్న చిన్న గొడవలకు వివాదాలు చేస్తే పార్టీ నుండి సస్పెండ్ చేస్తాము.కార్యకర్తలు ఐక్యంగా ఉంటే అందరికీ పదవులు ఇచ్చే విధంగా కృషి చేస్తాం.ఇన్ని రోజులు కార్యకర్తలు మన గెలుపు కోసం కష్టపడ్డారు ఇప్పుడు వారి రుణం తీర్చుకోవడానికి సమయం ఆసన్నమైంది వారికోసం పనిచేసి వారిని గెలిపించి నాయకులు
గా తీర్చిదిద్దుతాం.
అందరూ పార్టీ సమావేశాలు తప్పకుండా రావాలి.
ఏఐసీసీ ఆదేశాలు మేరకు గ్రామ,మండల,బ్లాక్ కమిటీలు ఏర్పాటుకు అందరూ సహకరించాలి.కార్యకర్తలకు బాధ్యతలు,పదవులు ఇవ్వడమే మా లక్ష్యం,భూ భారతీ ద్వారా రైతుల సమస్యలు పరిష్కరిస్తున్నాము.
Kcr డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో కమిషన్లు తిన్నారు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నియోజకవర్గానికి 3500 ఇళ్లు ఇస్తుంది.ఒక్కొక నియోజకవర్గానికి 10000 ఇల్లు ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధంగా ఉందని అన్నారు.మన వాళ్ళు వేరే వాళ్ళు అనే తేడా లేకుండా ప్రతి పేదవాడికి ఇల్లు అందిస్తాం. ఇల్లు నిర్మాణ పనులను బట్టి నిధులు మంజూరు అవుతాయి.
జై బాపు జై భీం జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమము గ్రామ గ్రామాన తీసుకు వెళ్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఇంకా గట్టిగా ప్రజల్లోకి తీసుకుపోవాలి.పార్టీ లేకుంటే కండువా లేకుంటే మనకు అవకాశం ఇచ్చేది ఎవరు.రాబోయే ఎన్నికల్లో పార్టీ బలంగా నిలబడాలంటే ముందుగా మన ప్రభుత్వం అధికారంలో ఉండాలి.కావున మనలో మనం కలిసి ఉండాలి పాత కొత్త అనే తేడా ఉండకూడదు. పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత మనపైన ఉంది.ఎవరైతే కింది స్థాయిలో పార్టీ జెండా మోసి బలోపేతానికి పనిచేశారో వారిని గుర్తించి వారికి పదవులు ఇస్తాం.క్రమశిక్షణ కలిగిన వారికే పార్టీ పదవులు వస్తాయిఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అనుబంధ సంఘాల ప్రెసిడెంట్లు
మండల అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు మాజీ జెడ్పిటిసి లు మాజీ ఎంపీటీసీలు సర్పంచులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు




Post Comment