ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ను వీక్షించిన భారతీయ జనతాపార్టీ శివ్వంపేట మండల నాయకులు…
ప్రజా సింగిడి ప్రతినిధి శివంపేట . ఏప్రిల్ ,27.
మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని భారతీయ జనతాపార్టీ శివ్వంపేట మండల నాయకులు వీక్షించడం జరిగింది. ఈ మన్ కీ బాత్ ప్రోగ్రాంలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ కాశ్మీర్ లోని పహల్గాం లో పర్యటకులపై ఉగ్రవాద దాడి సంఘటన భారతదేశంలోని 140 కోట్ల ప్రజల హృదయాలను కలచివేసిందని, ఇలాంటి సంఘటనలు దేశంలో జరగడం ఎంతో బాధాకరమని, పాకిస్తాన్ కు తగిన బుద్ధి త్వరలోనే చెప్తామని మోదీ తెలియజేయడం జరిగింది. అనంతరం శివ్వంపేట మండల శాఖ తరపున చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కొండల్ రావు , మండల అధ్యక్షులు పెద్దపులి రవి , యువ నాయకులు అశోక్ సాదుల , మండల ఇంచార్జ్ సుంచు శ్రీశైలం యాదవ్ , మాజీ సర్పంచ్ లు ర్యావ పనస రెడ్డి , కాషా ఆంజనేయ చారి , బానోత్ గోపియా నాయక్ , ఎరుకలి భిక్షపతి , మండల నాయకులు వినోద్ కుమార్, నాగేందర్ రెడ్డి, బల్కంపేట భాస్కర్, దుబ్బ శేఖర్, భీమ్ రావు, భాస్కర్ నాయక్, సుధాకర్, నాగరాజు, సురేష్, సంజీవులు, నాగరాజు, భాస్కర్, వినయ్, తేజ, భిక్షపతి యాదవ్, శ్రీనివాస్, ప్రభు, రామ్ సింగ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.




Post Comment