ప్రతి పేదవారికి రేషన్ కార్డ్ లు…
ప్రతి పేదవారికి రేషన్ కార్డ్ లు…
- ◆మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్, కామారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ ఎస్టీ సెల్ జనరల్ సెక్రెటరీ సుభాష్ నాయక్.
ప్రజా సింగిడి,కామారెడ్డి,జులై 26:
రాజంపేట మండలం అన్నారం గ్రామంలో నూతన రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగిందని రాజంపేట మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్, కామారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ ఎస్టీ సెల్ జనరల్ సెక్రెటరీ సుభాష్ నాయక్ తెలిపారు.ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేక పేద ప్రజలు ఎన్నో పథకాలు కోల్పోవడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనలో ప్రతి పేదవారికి రెషన్ కార్డ్ పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




Post Comment