పోస్టల్ ద్వారా మీ ఇంటి వద్దకే భద్రాచలం శ్రీరాములోరి తలంబ్రాలు
-పోస్టల్ ఎస్పి ఎల్ వి మురళి కుమార్
ప్రజా సింగిడి ప్రతినిధి పటాన్చెరు పటాన్చెరు నియోజకవర్గం మార్చ్ 26.
శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలోని శ్రీ సీతారాముల వారి కళ్యాణోత్సవ తలంబ్రాలను తపాలా శాఖ ద్వారా భక్తులకు అందించే సేవలను ప్రారంభించినట్లు సంగారెడ్డి డివిజన్ పోస్టల్ ఎస్పీ ఎల్ వి మురళి కుమార్ తెలిపారు.భద్రాచలం వెళ్లలేని భక్తుల సౌకర్యార్థం ఈ సేవలను రాష్ట్ర దేవాదాయ శాఖతో ఒప్పందం చేసుకొని ముందుకు తీసుకు వచ్చామని పేర్కొన్నారు. స్పీడ్ పోస్ట్ ద్వారా అంతరాలయ అర్చన కళ్యాణ తలంబ్రాలు 10 గ్రాములు, ఒక ముత్యం, పసుపు ,కుంకుమ, మిస్రి, ఖాజు, 80 గ్రాముల ప్రసాదం కోసం భక్తులు తమ దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి 450/- రూపాయలు చెల్లించి బుక్ చేసుకోవచ్చని తెలిపారు. అలాగే ముత్యాల తలంబ్రాల 20 గ్రాములు , ఒక ముత్యం ప్రసాదం కోసం 150/- రూపాయలు చెల్లించి సేవలు పొందవచ్చని పేర్కొన్నారు. తెలంగాణ పోస్టల్ సర్కిల్ ఆధ్వర్యంలో సంగారెడ్డి డివిజన్ పరిధిలో కూడా ఏప్రిల్ 1వ తేదీ వరకు ఈ సేవలు అన్ని పోస్ట్ ఆఫీస్ లలో అందుబాటులో ఉంటాయని వివరించారు. ఈ అవకాశాన్ని భక్తులుసద్వినియోగపరుచుకొని , భద్రాచలం శ్రీ రాములోరి ఆశీస్సులు పొందాలని సంగారెడ్డి పోస్టల్ ఎస్పి ఎల్ వి మురళి కుమార్ సూచించారు




Post Comment