పెద్దిరాజు పెద్దమ్మ వార్షికోత్సవంలో పాల్గొన్న బండారి గంగాధర్
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. మర్చి, 26.
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం అల్లీపూర్ గ్రామంలో శ్రీశ్రీశ్రీ పెద్దిరాజు పెద్దమ్మ మొదటి వార్షికోత్సవం సందర్భంగా మూడవరోజు అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖ సంఘ సేవకులు బీసీ నాయకులు మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి గంగాధర్ .ప్రత్యేక పూజలు నిర్వహించి పెద్దమ్మ తల్లి ఆశీస్సులు మాపై ఒక గ్రామ ప్రజల పైన కూడా ఉండాలని అమ్మవారినీ దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ యొక్క పెద్దమ్మ తల్లి అన్నదాన కార్యక్రమానికి తన వంతు సహాయంగా 100 కిలోల సన్న బియ్యాన్ని అందజేయడం జరిగింది. అదేవిధంగా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు మరియు సభ్యులు వచ్చినటువంటి ముఖ్య అతిథులకు గౌరవంగా శాలువతో సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శివంపేట మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొడకంచి సుదర్శన్ గౌడ్ . బ్లాక్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ బాసంపల్లి శ్రీనివాస్ గౌడ్ నవపేట్ అశోక్ చెన్నాపూర్ రాజిరెడ్డి రాజేందర్ నాయక్ జరుపుల పాండ్యా నాయక్. అల్లిపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మన్నె శ్రీనివాస్ ముదిరాజ్. ఆంజనేయులు గౌడ్ వెంకటేష్ బండారి ముత్యాలు బండారి శ్రీనివాస్ బి జి ఆర్ యువ కిరీటం బండారి సాయి కిరణ్ గాండ్ల దాసు పెద్దపులి వినయ్ పిల్లి మణికంఠ అల్లిపూర్ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.




Post Comment