పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. మే, 04
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం దొంతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2010-11 సంవత్సరం కు చెందిన పదవ తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం రోజు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భం గురువులతో పూర్వ విద్యార్థులు తూప్రాన్ లోని సీ ఎన్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో అందరూ కలుసుకొని అప్పటి గురువులను సన్మానించారు. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడంతో పాటు యోగక్షేమాల గురించి చర్చించుకున్నారు.ఈ సందర్బంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఇన్ని రోజులకు చదువు చెప్పిన విద్యార్థులను కలిసి వారి యోగ క్షేమలను తెలుసుకోవటం ఎంతో ఆనందకరంగా ఉందన్నారు ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్ రెడ్డి,ఉపాధ్యాయులు కాంతమ్మ, జై శ్రీ, వెంకట లక్ష్మి, స్వామి, అసిస్టెంట్ నర్సింలు పాల్గొన్నారు




Post Comment