పార్టీ కోసం పని చేసేవారికే పదవులు
ప్రభుత్వ విప్ డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక
ప్రజా సింగిడి ప్రతినిధి దంతాలపల్లి. మే 08.

దంతాలపల్లి మండల కేంద్రంలో కుమ్మరి కుంట్ల గ్రామం బాలాజీ గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి,టిపిసిసి ఆదేశాలు మేరకు, రాష్ట్ర ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ సూచనలతో…డీసీసీ అధ్యక్షుడు జన్నారెడ్డి భరత్ చంద్రారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ డోర్నకల్ శాసనసభ్యులు రామచంద్రనాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా: రామచంద్రనాయక్ మాట్లాడుతూ…పార్టీ కోసం పని చేసిన వారికి సంస్థాగత పార్టీ పదవుల్లో ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పారు.కష్టకాలంలో పార్టీ కోసం పని చేసిన వారిని పార్టీ గుర్తిస్తుందని, అవకాశాలు కల్పిస్తుందని చెప్పారు.తానూ కూడా పార్టీ కోసం పని చేశానని, నా పనిని చేసే అధిష్టానం తనకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిందన్నారు.అలాగే డోర్నకల్ నియోజకవర్గంలో ఏంతో మంది కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రతిపక్షంలో ఉన్నపుడు, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పని చేశారని గుర్తు చేశారు.అవకాశం వచ్చినా…రాకపోయినా… పదవులు ఉన్నా… లేకున్నా పార్టీ సిద్ధాంతం కోసం పని చేస్తే… పదవులు అవే వస్తాయన్నారు.జిల్లా, బ్లాక్, మండల, గ్రామ స్థాయిలలో పర్యటించి, అందరి అభిప్రాయాలు తీసుకుని, జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలను ఒపీనియన్ తీసుకుని ఆశావహుల జాబితాను తయారు చేసి, అధిష్టానానికి పంపిస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో పిసిసి పరిశీలకులు రవళి రెడ్డి , దంతాలపల్లి మండల అధ్యక్షులు,తొర్రూర్ మార్కెట్ వైస్ చైర్మన్ బట్టు నాయక్ ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దాసోజు రాజశేఖర్ ,సంపేట రాము , మాజీ ఎంపిటిసి కొమ్మినేని సతీష్ , దంతాలపల్లి మండలం యూత్ అధ్యక్షుడు సంపేట సురేష్ ,జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు మండల నాయకులు,మాజీ ప్రజా ప్రతినిధులు,మార్కెట్ చైర్మన్లు,డైరెక్టర్లు,గ్రామ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




Post Comment