పహల్గామ్ ఉగ్రదాడి తనను తీవ్రంగా కలిచివేస్తోంది
ప్రజాసింగిడి ప్రతినిధి బాలనగర్ మండలం, జడ్చర్ల నియోజకవర్గం, మహబూబ్ నగర్ జిల్లా,23. ఏప్రిల్.
*బాలానగర్ మండల ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి నేరళ్లపల్లి ఆర్ యాదయ్య ఆవేదన*
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తనను తీవ్రంగా కలిచివేస్తోందని నేరళ్లపల్లి ఆర్ యాదయ్య అన్నారు. ఈ దాడిలో చనిపోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ పత్రిక ప్రకటన విడుదల చేశారు.
“పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తీవ్రంగా కలిచివేస్తోందనీ ఈ దాడిలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని పేర్కొన్నారు.
ఈ క్లిష్ట సమయంలో ఐక్యంగా ఉందాం. మన భారత ఐక్యతను ఏ ఉగ్రవాదం విచ్ఛిన్నం చేయలేదు. ఇలాంటి దారుణాలు మరోసారి జరగకుండా చూడాలి. సమష్టిగా మనం దీన్ని అధిగమిద్దాం… కలిసికట్టుగా ఉందాం. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది” అని మండల ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి నేరళ్లపల్లి ఆర్ యాదయ్య ఆవేదనతో తెలిపారు. ఉగ్రవాదులను అంతమొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.




Post Comment