పశువుల అక్రమ రవాణా నియంత్రణకు జిల్లాలో నిరంతర పర్యవేక్షణ.
ప్రజా సింగిడి ప్రతినిధి మెదక్. జూన్, 04.
మెదక్ జిల్లా ఇంచార్జ్ ఎస్పీ. రాజేష్ చంద్ర
పశువుల రవాణా విషయంలో వెటర్నరీ డాక్టర్ నిబంధనలు పాటించాలి. నిబంధనలను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
మెదక్ జిల్లా ఇంచార్జ్ ఎస్పీ. రాజేష్ చంద్ర ,
ఈ సందర్భంగా మెదక్ జిల్లా ఇంచార్జ్ ఎస్సీ, . రాజేష్ చంద్ర మాట్లాడుతూ మెదక్ జిల్లా పరిధిలో పశువుల అక్రమ రవాణాను అరికట్టడానికి జిల్లా, సరిహద్దులో చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నాడు. చెక్ పోస్టులో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, ప్రత్యేక చెక్ పోస్టులలో పోలీసు, పశుసంవర్ధక శాఖ సిబ్బందితో షిఫ్ట్ ల వారిగా సమన్వయంతో విధులు నిర్వహించడం జరుగుతుందన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణ కోసం ముందస్తు చర్యలలో భాగంగా పశువుల రవాణా విషయంలో వివాదాలు తలెత్తకుండా ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా జంతువుల అక్రమ రవాణా, గోవధ విషయంలో నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పదని అన్నారు. ప్రధానంగా బక్రీద్ పండుగ సందర్భంగా పశువుల రవాణా విషయంలో అవసరమైన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని, చట్టవిరుద్ధంగా ఆవులు, దూడలను రవాణా చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఆదేశించారు.
పశువులను రవాణాచేసి ప్రతి వాహనానికి తగు నిర్ధారిత ప్రమాణిక పత్రాలు (వాలిడ్ డాక్యుమెంట్స్) ఉండాలని స్పష్టం చేశారు. సరిహద్దు రాష్ట్రాల నుండి రవాణా అయ్యే పశువుల విషయంలోనూ నియమ, నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించాడు. సరైన పత్రాలు వారి వెంట ఉన్నాయనే విషయాన్ని పరిశీలించి అనుమతించాలని, అక్రమ రవాణా చేస్తే చర్యలు తీసుకోవాలని చెప్పాడు.
ఏ వ్యక్తి లేదా సంస్థ స్వయంగా వాహనాలను ఆపకూడదనీ, ఈ విషయంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా అనుమానాస్పద అక్రమ రవాణా గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలనీ సూచించారు.
అదేవిధంగా సోషల్ మీడియాలో ద్వేష పూరిత, రెచ్చగొట్టే మరియు అసభ్యకరమైన పోస్టులు పెడితే, వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా, మత సామరస్యంతో జరుపుకునేలా అవసరమైన చోట్ల ముందస్తుగా పటిష్టమైన పోలీసు బందోబస్తు, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపాడు.
అదేవిధంగా అక్రమ రవాణా నియంత్రించేందుకు నిఘా విభాగం అప్రమత్తంగా వుంటుందని, చెక్ పోస్టుల తనిఖీలే కాకుండా జిల్లా కేంద్రంలో సైతం ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారని అన్నారు. ఎవరైనా అక్రమ రవాణా చేస్తూ పట్టుబడితే వారి వాహనాలు సీజ్ చేస్తామన్నారు.




Post Comment