పలు మండల కేందలలో ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం
పలు మండల కేంద్రాలలో ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం
ప్రజా సింగిడి ప్రతినిధి నర్సాపూర్. మర్చి, 16.
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) పిలుపు మేరకు, నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ని అవమానపరిచిన ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మను నర్సాపూర్ పట్టణంలో, శివ్వంపేట,తూప్రాన్ మండల కేంద్రంలో దహనం చేయడం జరిగింది.ఈ నిరసన కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ అసెంబ్లీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి పాల్గొని, మాట్లాడుతూ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై చేసిన అవమానకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సభా పద్దతులను మర్చిపోయి, అసభ్యంగా ప్రవర్తించడం ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకమని ఆయన అన్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎప్పటికీ పోరాడుతుందని, ప్రజా ప్రతినిధుల గౌరవాన్ని కాపాడడానికి ఈ నిరసన కొనసాగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ , నర్సారెడ్డి శివ్వంపేట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పులిమామిడి నవీన్ గుప్తా, శివ్వంపేట పి ఏ సి ఎస్ చైర్మన్ చింతల వెంకట్రాంరెడ్డి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




Post Comment